For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధాటిగా ఆడటం ముఖ్యం కాదు.. అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు : ధోనీ

 IPL 2020, KXIP vs CSK: MS Dhoni Says Consistency in Selection Something We Bank on
IPL 2020, CSK vs KXIP : Hope To Replicate This Result In Coming Games - MS Dhoni || Oneindia Telugu

దుబాయ్: విజయం సాధిచడమంటే ధాటి‌గా ఆడటమే ముఖ్యం కాదని, గెలుపుకు కావాల్సిన చిన్న విషయాలను కూడా వదలవద్దని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 10 వికెట్ల తేడాతో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్లు షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టడంతో పంజాబ్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. వాట్సన్, డూప్లెసిస్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. తన జట్టుపై నమ్మకముందని, ఈ మ్యాచ్‌లో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకున్నామని చెప్పాడు.

కుదురుకుంటే రెచ్చిపోతాడు..

కుదురుకుంటే రెచ్చిపోతాడు..

‘చిన్న విషయాలను కూడా వదల్లేదు. ఇన్ని రోజులు శుభారంభం కోసమే ఎదురు చూశాం. అక్కడే అనుభజ్ఞుల ఆట ఎంటో బయటపడుతుంది. విజయం సాధించడమంటే ధాటిగా ఆడటం కాదు. ఇన్ని రోజులూ వాట్సన్‌ నెట్స్‌లో సాధన చేస్తున్నా మైదానంలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. ఒకసారి కుదురుకుంటే అతను రెచ్చిపోతాడు. డుప్లెసిస్‌ తమ జట్టుకు ఆణిముత్యం. అతడెప్పుడూ తనదైన షాట్లతో బౌలర్లను అయోమయానికి గురిచేస్తాడు. జట్టులో మార్పులు చేయకపోవడానికి కారణం కూడా ఇదే.

 ఫ్లెమింగ్‌కు గుర్తింపు రావడంలేదు..

ఫ్లెమింగ్‌కు గుర్తింపు రావడంలేదు..

ఇక కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. మేమిద్దరం అన్ని విషయాలు చర్చించుకుంటాం. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటాం. పంజాబ్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మా ప్రణాళిక ప్రకారమే రాణించారు. ప్రతీ టీమ్‌లో భారీ హిట్టర్లున్నారు. బౌలర్లను చీల్చిచెండాడగలరు. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాట్సన్‌, డుప్లెసిస్‌ అద్భుతంగా ఆడారు. తమదైన షాట్లతో అలరించారు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

 ఫ్రాంచైజీ నమ్మకమే..

ఫ్రాంచైజీ నమ్మకమే..

ఆటగాళ్లపై ఫ్రాంచైజీకి ఉన్న నమ్మకమే తమ ప్రదర్శన కారణమని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ‘సాంకేతికంగా కొంచెం నేను వెనుకబడినట్లు అనిపించింది. కానీ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. జట్టు కాంబినేషన్, గెలవాలనే కసి మేం రాణించేలా చేసింది. ఫాఫ్‌తో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. బౌలర్లను అతను అయోమకయానికి గురిచేస్తాడు. ఆటగాళ్లపై ఫ్రాంచైజీకి ఉన్న నమ్మకం మా ఈ ప్రదర్శనకు కారణం. మేం ఇలాంటి మరిన్ని ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ఇదే జోరును కొనసాగిస్తాం'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు.

 చెన్నై చెమక్..

చెన్నై చెమక్..

తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.

KXIP vs CSK: కింగ్స్ పంజాబ్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలివే!

Story first published: Monday, October 5, 2020, 9:53 [IST]
Other articles published on Oct 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+