న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR: ముందుకా.. ఇంటికా? ఇరు జట్ల భవితవ్యం తేలేది నేడే!

IPL 2020, KKR vs RR: Who will win Kolkata Knight Riders vs Rajasthan Royals

దుబాయ్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌13 లీగ్‌‌‌‌ దశ చివరి అంకానికి వచ్చేసింది. మెగా టోర్నీ లాస్ట్‌‌‌‌ డబుల్‌‌‌‌ హెడర్‌‌‌‌లో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం తేలిపోనుంది. తలో పన్నెండు పాయింట్లతో 6,7 స్థానాల్లో నిలిచిన రాజస్తాన్‌‌‌‌, కోల్‌‌‌‌కతా జట్లు లీగ్​ దశలో తమ ఆఖరి ఆటకు రెడీ అయ్యాయి. మ్యాచ్ ఫలితంపైనే ఇరు జట్ల భవితవ్యం ఆధారపడి ఉండటంతో ఈ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. పటిష్ట ముంబైతో పాటు పంజాబ్‌‌‌‌ను చిత్తు చేసి జోరు మీదున్న రాయల్స్‌‌‌‌కే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. అదే ఊపులో కోల్‌‌‌‌కతా పని పట్టి 14 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని చూస్తోందా జట్టు. చివరి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడడంతో పాటు తక్కువ రన్‌‌‌‌రేట్‌‌‌‌తో ఉన్న కోల్‌‌‌‌కతా భారీ విజయంపై కన్నేసింది. అయితే ఇరు జట్లకు గెలవడమే ముఖ్యం కాదు.. రన్‌రేట్ మెరుగుపరుచుకోవడం కూడా అవసరమే. గెలిచినా.. మెరుగైనా రన్‌రేట్ లేకుంటే ఇంటి దారి పట్టాల్సిందే. మరేం ఏం జరుగుతోంది చూడాలి.

ఉత్సాహంగా రాజస్థాన్..

ఉత్సాహంగా రాజస్థాన్..

పటిష్ట ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లపై వరుసగా విజయం సాధించిన రాజస్థాన్ అమితోత్సాహంతో బరిలోకి దిగుతుంది. ఈ రెండు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలను చేధించిన రాజస్థాన్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, ఊతప్ప టచ్‌లోకి రావడం.. స్మిత్, బట్లర్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆ జట్టుకు కలిసొచ్చింది. వీరు మళ్లీ చెలరేగితే ఆ జట్టు బ్యాటింగ్‌కు ఎలాంటి డోకా ఉండదు. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి‌లతో బలంగానే ఉంది. వరుణ్ ఆరోన్ వద్దనుకుంటే అంకిత్ రాజ్‌పుత్ జట్టులోకి రావచ్చు.

ఒత్తిడిలో కోల్‌కతా..

ఒత్తిడిలో కోల్‌కతా..

టోర్నీ ఆరంభం నుంచి ఒకడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అన్నట్లు కోల్‌కతా ఆట సాగింది. నిలకడలేమి ఆటతో ఓటములు ఎదుర్కొని తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. గెలిచినా ప్లే ఆఫ్స్ చేరేది కష్టమే అన్నట్లుగా ఉంది ఆ జట్టు పరిస్థితి. బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడటంతో ఆ జట్టు రన్ రేట్ దారుణంగా ఉంది. దాంతో కోల్‌కతా తీవ్ర ఒత్తిడిలో ఉంది. దానికి తోడు పసలేని బ్యాటింగ్.. బౌలింగ్‌తో విఫలమవుతుంది. నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ రాణిస్తున్నా.. ఇతరులు విఫలమవడం ఆ జట్టు కొంప ముంచింది.

బౌలింగ్‌లో ఫెర్గూసన్ ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన తర్వాత తేలిపోయాడు. ఇక రూ.15 కోట్ల ఆటగాడు కమిన్స్ ఇప్పటి వరకు తన మార్క్ పెర్ఫెమెన్స్ కనబర్చలేకపోయాడు. అద్భుత విజయం అందుకుంటేనే టోర్నీలో కోల్‌కతా ముందడుగు వేయగలదు. అయితే ఫస్టాఫ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలవడం కోల్‌కతా కలిసొచ్చే అంశం.

పిచ్ రిపోర్ట్/ముఖా ముఖి

పిచ్ రిపోర్ట్/ముఖా ముఖి

సెకండాఫ్‌లో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారాయి. టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. చేజింగ్‌కు అనుకూలిస్తున్నాయి. నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఫలితం చేజింగ్‌కు అనుకూలంగా ఉండటం, డ్యూ ప్రభావం కనబడటంతో టాస్ గెలిచిన జట్టు ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 11-10తో కోల్‌కతా లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో చెరొక మ్యాచ్ గెలిచాయి.

తుది జట్లు: (అంచనా)

తుది జట్లు: (అంచనా)

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమ‌న్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్( కీపర్), రింకూ సింగ్/ప్రసిద్ కృష్ణ, ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్ కోటీ, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్: బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్(కీపర్), రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్(కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పూత్/వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి

DC vs MI: ఇషాన్ కిషన్ విన్నింగ్ సిక్సర్‌.. నోరెళ్లబెట్టిన రోహిత్ శర్మ (వీడియో)

Story first published: Sunday, November 1, 2020, 15:23 [IST]
Other articles published on Nov 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X