Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ గాయంపై మళ్లీ దుమారం.. సీబీఐ దర్యాప్తు చేయాలంటున్న ఫ్యాన్స్!

 IPL 2020: Fans demand Separate CBI Enquiry on Rohit Sharma Injury

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంపై మళ్లీ దుమారం రేగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ బరిలోకి దిగడంపై అభిమానులు అయోమయానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్న ఫ్యాన్స్.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడ్డ హిట్ మ్యాన్ తర్వాత నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు రోహిత్‌ను పక్కనపెట్టారు. తొడ కండరాల గాయం కావడం.. అది తీవ్రంగా ఉండటంతో కనీసం 2-3 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని టీమిండియా ఫిజియో రిపోర్ట్ ఇవ్వడంతో సెలెక్టర్లు రోహిత్‌పై వేటు వేసారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ బరిలోకి దిగడంతో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.

రోహిత్‌తో బీసీసీఐకి తలనొప్పి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా.. రోహిత్ శర్మ గాయాన్ని పరీశీలిస్తున్నామని, కోలుకుంటే ఆసీస్ పర్యటనకు పంపిస్తామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రోహిత్ భవిష్యత్తు దృష్ట్యానే అతనికి విశ్రాంతి అవసరమని భావించామన్నాడు. కానీ గంగూలీ ఈ మాట చెప్పిన గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ మ్యాచ్‌లో ఆడాడు. దాంతో.. ఈ పొంతనలేని సమాధానాలేమినటి నెటిజన్లు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ గాయం తీవ్రమే అయితే.. డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లకు ఎంపిక చేయవచ్చు కదా? అని నిలదీస్తున్నారు. దాంతో రోహిత్ శర్మ గాయం బీసీసీఐతో పాటు భారత సెలెక్టర్లకు ఓ తలనొప్పిలా మారింది.

హిట్ మ్యాన్ ఫిట్ అవ్వలేదు..

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ( 7 బంతుల్లో 4)దారుణంగా విఫలమయ్యాడు. మూడో ఓవర్‌లోనే పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి అతను డబుల్ వచ్చే దగ్గర సింగిల్ తీసి.. అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ ఇచ్చుకున్నాడు. అతను ఔటైనప్పుడు కూడా కామెంటేటర్ల నోట కూడా ఇదే మాట వచ్చింది. ఇక ఫీల్డింగ్‌లోనూ అతను ఏమంత ఉత్సాహంగా కనిపించలేదు. మరీ ముఖ్యంగా.. తన పక్క నుంచి వెళ్తున్న బంతి కోసం డైవ్ చేసే సాహసం చేయలేదు. దాంతో.. అతను గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని స్పష్టంగా అనిపించింది. కొంత మంది అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఈ మొండితనం ఎందుకు

గాయం తీవ్రత పూర్తిగా తగ్గకుండానే రోహిత్ శర్మ మ్యాచ్ ఎందుకు ఆడాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అది కూడా బుమ్రా, హార్దిక్, బౌల్ట్‌లను పక్కన పెట్టి లైట్ తీసుకున్న మ్యాచ్‌లో ఫిట్‌గా లేని రోహిత్ ఆడించడం ఎందుకో? బీసీసీఐని నిందించడానికేనా? అని అభిమానులు నిలదీస్తున్నారు. అతను గాయం నుంచి కోలుకున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదని, ఆసీస్ టూర్‌కు ఎంపికవ్వలేదన్న బాధలోనే బరిలోకి దిగినట్లు అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. హిట్‌మ్యాన్ మొండితనంపై బీసీసీఐ, సెలెక్టర్లు ఏం చెప్తారో చూడాలి.

IPL 2020: ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్.. యువ ఆస్ట్రాలజర్‌కు ఫుల్ డిమాండ్!

Story first published: Wednesday, November 4, 2020, 10:43 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+