
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భయంతో పరుగెత్తాడు. అవును.. సహచర ఆటగాడు వాషింగ్టన్ సుంధర్ కొట్టిన భారీ సిక్సర్‌కు ఈ లెగ్ స్పిన్నర్ తీవ్రంగా భయపడి డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగు తీసాడు. దీంతో అక్కడా నవ్వులు పూసాయి. అసలు విషయం ఏంటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు.
12 ఓవర్లలో 69 రన్స్ మాత్రమే చేశారు. రన్ రేట్ 6 కూడా లేదు. ఈ క్రమంలో కరన్ శర్మ వేసిన ఓవర్‌లో వాషింగ్టన్ సుంధర్ భారీ సిక్సర్ కొట్టాడు. ఔట్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని లాంగాన్ వైపు భారీ సిక్సర్‌గా తరలించాడు. అయితే ఆ దిశలో డ్రెస్సింగ్ రూమ్ వద్ద కూర్చున్న చాహల్ దగ్గరకు బంతి సమీపించడంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఊహించని పరిణామంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగుతీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్‌కు క్రిస్ మోర్రిస్ సూపర్ బౌలింగ్ తోడవడంతో ఆర్‌సీబీ 37 పరుగులతో చెన్నైని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చాహల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన తెలివైన బౌలింగ్‌తో ధోనీని ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.