ధోనీ గుండు చేసుకున్నా ఓటమి తప్పలేదు.. చెన్నై ఓటమిపై పేలుతున్న జోక్స్, మీమ్స్

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2020 బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఊహించని విధంగా విఫలమవుతుంది. జట్టులో మార్పులు చేసినా.. వ్యూహాలు మార్చినా ఆ జట్టుకు ఓటమి తప్పడం లేదు. చెత్త బ్యాటింగ్‌తో కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేస్తుంది. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా 37 పరుగులతో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో అదరగొట్టిన చెన్నై బౌలర్లు.. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ధాటికి ఆఖరి నాలుగు ఓవర్లలో చేతులెత్తేశారు. దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం టెస్ట్‌ను తలపించే బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌పై అభిమానులు నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డాడీల కథ ముగిసిందని, ఆటకు అందరూ గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు.
గుండు చేసుకున్నా..
ఇక ఈ మ్యాచ్‌లో ధోనీ న్యూలుక్‌తో కనిపించాడు. పూర్తిగా గుండు చేసుకొని బరిలోకి దిగాడు. మాములుగా ధోనీ హెయిర్ స్టైల్ మార్చడంటే అతని ఆట కూడా మారుతుందని అభిమానులు అశిస్తుంటారు. అసలు క్రికెట్‌లో వచ్చిన కొత్తలో ధోనీ హెయిర్ స్టైల్‌కే అభిమానులు ఫిదా అయ్యారు. అతను స్టైల్ మార్చినప్పుడల్లా అదరగొట్టేవాడు. తాజా మ్యాచ్‌లో కూడా ధోనీ ఇరగదీస్తాడనుకున్నారు. కానీ అదేం జరగలేదుం. 6 బంతులు ఆడిన ధోనీ ఓ సిక్స్ కొట్టి ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతని న్యూలుక్‌పై అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘గుండు కొట్టించుకున్నా.. ఫలితం మారలేదు'అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఎవడ్రా టెస్ట్ క్రికెట్...
ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. అసలు ఇది టీ20నా లేక టెస్ట్ మ్యాచా? అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది. తొలి 5 ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (8) వికెట్‌నూ కోల్పోయింది. తర్వాత వాట్సన్ (14) కూడా చేతులెత్తేశాడు. 10 ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు ఎవడ్రా టెస్ట్ క్రికెట్ కనుమరుగవుతుందని చెప్పింది.. డాడీస్ ఆర్మీ ఉన్నంత వరకు ఐపీఎల్‌లో కూడా టెస్ట్ క్రికెట్ బతికే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
రాయుడు కూడా..
ఇక ముంబైతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్నందించిన అంబటి రాయుడు కూడా విఫలమవుతున్నాడు. బెంగళూరుతో రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు) రప్ఫాడించలేకపోయాడు. పూర్తిగా వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. దీంతో చివర్లో రన్ రేట్ పెరిగి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు రాయుడుని ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘వెల్‌కమ్ టూ కేదార్ జాదవ్ కబ్ల్'అని కామెంట్ చేస్తున్నారు. 170 పరుగులు చేధించడానికి మీకు 200 బంతులు ఇవ్వాలేమోనని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.
సీఎస్‌కే ట్విటర్ హ్యాండిల్లోనే సెటైర్స్..
ఇక చెన్నై బ్యాటింగ్‌కు విసుగెత్తిపోయిన ఆ జట్టు ట్విటర్ హ్యాండిలే.. వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చెన్నై బ్యాటింగ్ చూస్తుంటే మీరేం అనుకుంటున్నారనీ, బీపీ టాబ్లేట్ లేక, బీ పాజిటీవ్ అని భావిస్తున్నారా? అని క్వశ్చన్ పోల్ పెట్టింది. ఇందులో బీ పాజిటివ్ అని 50.6 శాతం మంది చెప్పగా.. 49.4 శాతం మంది బీపీ టాబ్లేట్ వేసుకోవాలని ఉందన్నాడు. అంతటితో ఆగకుండా నిదానంగా సాగుతున్న తమ జట్టు ఇన్నింగ్స్ చూసి.. పాజిటివిటీ అనే కాప్షన్‌తో ఓ మీమ్ షేర్ చేసింది. తలపై కండువా, మస్తుగా బ్యాటింగ్ చేస్తున్నావ్ అన్నట్టు ఉండే ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేసింది.
CSK vs RCB: ఇన్ని హోల్స్ ఉన్న షిప్‌ను నడిపెదెలా? ఓటమిపై ధోనీ అసహనం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications