
చెత్త బ్యాటింగ్..
‘మా బౌలింగ్‌లో చివరి నాలుగు ఓవర్లలో పరుగులిచ్చుకున్నాం. కట్టుదిట్టంగా చేసుంటే గట్టి పోటీ ఇచ్చేవాళ్లం. మా బ్యాటింగ్ మరి చెత్తగా ఉంది. ఈ రోజు కూడా అదే పునరావృతం అయింది. బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మా బ్యాటింగ్‌లో వేగం పెంచాలి. ఔటైనా సరే భారీ షాట్లు ఆడాలి. తదుపరి మ్యాచ్‌ల్లో అదే వ్యూహంతో బరిలోకి దిగుతాం. ఆరో ఓవర్ నుంచే ధాటిగా ఆడాలి. కానీ మా బ్యాటింగ్‌లో అది కనిపించడం లేదు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన తీరు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత ప్రదర్శనలు ఎన్ని చేసినా తాత్కలికమే. టీమ్ ఎఫర్ట్ ముఖ్యం.

ప్రత్యర్థికి తగ్గట్లు ప్రణాళికలు లేవు..
ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొవడానికి మేం ప్రణాళికలు రచించడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా 6 నుంచి 14 ఓవర్లలో ఎవరూ బౌలింగ్ చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలను రచించలేకపోయాం. గత ఫలితాలను పట్టించుకోవద్దని, ప్రక్రియపై దృష్టిసారించాలని మా ఆటగాళ్లకు ఎప్పుడూ చెబుతుంటాను. గత మ్యాచ్ ఫలితాల గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇక బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాం. కానీ ప్రారంభంలో లేకుంటే చివరి నాలుగు ఓవర్లలో తేలిపోతున్నాం. భారీ పరుగులిచ్చుకుంటున్నాం.

మా ఆందోళనంతా బ్యాటింగే..
షిప్‌లో చాలా బొక్కలున్నాయి. ఒక హోల్‌ను పూడ్చేవరకు మరో రంధ్రం నుంచి నీళ్లు వస్తున్నాయి. మా జట్టు పరిస్థితి అలానే ఉంది. అందరూ జట్టు కాంబినేషన్‌ను చూస్తూ ఎంత మంది స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని మాట్లాడుతున్నారు. మేం ఐదుగురు బౌలర్లతో ప్రారంభించాం. ఇప్పుడు ఆరుగురికి చేశాం. కానీ మా ప్రధాన ఆందోళన బ్యాటింగ్. తదుపరి మ్యాచ్‌ల్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాం. ఔటైనా పర్లేదు కానీ భారీ షాట్లు ఆడాలనే ఆలోచనతో వస్తాం. ఎందుకంటే 15 నుంచి 16 ఓవర్లలో బంతులను వృథా చేయలేం. అప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి నెలకొంటుంది'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ పరుగెత్తించాడు..
బంతులు నిప్పులు చెరిగేచోట కోహ్లీ బ్యాట్ గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కానీ ఇన్నింగ్స్‌తో అతను బెంగళూరును గెలిపించాడు. బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.
IPL 2020: ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవదు అనడానికి మూడు బలమైన కారణాలు!


Click it and Unblock the Notifications
