For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కేతో కాంట్రాక్ట్ రద్దయింది.. ధోనీపై హర్భజన్‌‌సింగ్‌కు నోరులేస్తుంది.. ఫ్యాన్స్ ఫైర్

IPL 2020: Harbhajan Singh mercilessly trolled by netizens after his indirect dig at MS Dhoni’s age

దుబాయ్‌: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. భజ్జీ తీరు 'ఒడ్డు దాటేదాక ఓడు మల్లన్న ఒడ్డు దాటినాక బోడిమల్లన్న'అన్నట్లుందని విమర్శిస్తున్నారు. సీఎస్‌కే ఆడుతున్నన్ని రోజులు మహీపై ప్రశంసల జల్లు కురిపించిన హర్భజన్ సింగ్.. సీఎస్‌కేతో తన కాంట్రాక్టు రద్దవ్వగానే తన అసలు స్వరూపం భయటపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు సూపర్ కెప్టెన్ అని మెచ్చుకున్న భజ్జీకి ఇప్పుడు ధోనీని విమర్శించేందుకు నోరు లేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. 165 పరుగుల సాధారణ లక్ష్య చేధనలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అంతా తడబడ్డారు. చివర్లో జడేజా, ధోనీ ఆశలు రేకిత్తించినా సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సాధ్యం కాలేదు. ధోనీ కడవరకు నిలుచొని 47 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడేందుకు.. వికెట్ల మధ్య పరుగు తీసేందుకు మహీ ఇబ్బంది పడ్డాడు. దుబాయ్‌లోని వాతావరణం వేడిగా ఉండటం వలనే ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం ధోనీ వివరణ కూడా ఇచ్చాడు.

ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు..

అయితే భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌, ధోనీ పేరు ప్రస్తావించకుండా ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించాడు. 'వయసు అనేది కొందరికి సంఖ్య మాత్రమే, అయితే అదే మరికొందరని తప్పించడానికి కారణమవుతుంది' అని మహీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కామెంట్స్‌కు మద్దతు పలుకుతూ.. హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. పఠాన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... 'ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యలతో నేను 10,00,000 శాతం అంగీకరిస్తాను' అంటూ పేర్కొన్నాడు.

కాంట్రాక్టు రద్దయిందిగా..

అయితే భజ్జీ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమవడంతో ఈ ఇద్దరితో చెన్నై సూపర్ కింగ్స్ తమ కాంట్రాక్టులను రద్దు చేసుకుందనే వార్తలు వినిపించాయి. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు భజ్జీని ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘కాంట్రాక్ట్ రద్దయిందేమో.. ధోనీపై భజ్జీకి నోరు లేస్తుంది'అని ఒకరంటే.. భజ్జీ ద్వంద వైఖరి సిగ్గుచేటని మరొకరు ఘాటుగా విమర్శించారు. ఆడుతున్నప్పుడు ఒక మాట.. జట్టుకు దూరంగా ఉన్నప్పుడు మరొక మాటనా? అని భజ్జీని ప్రశ్నిస్తున్నారు.

హ్యాట్రిక్ పరాజాయం..

హ్యాట్రిక్ పరాజాయం..

ఆరేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గి బోణీ కొట్టిన సీఎస్‌కే.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. ధోనీ కూడా తన మార్క్‌ ఆటతీరును ప్రదర్శించలేక పోతున్నాడు. దీంతో ఇప్పుడు అతని ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ధోనీ చివరి వరకూ క్రీజ్‌లో ఉంటే గెలుపు తథ్యం అనే భరోసా ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సీఎస్‌కే నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని భావిస్తోంది.

RCB vs RR: మా ఓటమికి అదే కారణం.. బౌలర్ల తప్పులేదు: స్టీవ్ స్మిత్

Story first published: Sunday, October 4, 2020, 15:36 [IST]
Other articles published on Oct 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+