రైట్-లెఫ్ట్ కాంబినేషనా? మరీ నువ్వెందుకు ఫస్ట్ డౌన్‌లో వచ్చావ్? కోహ్లీపై సెహ్వాగ్ ఫైర్

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను నాలుగో స్థానంలో పంపించకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో తనకు అర్థంకాలేదన్నాడు. అతన్ని కాకుండా వాషింగ్టన్ సుంధర్, శివమ్ ధూబేలను పంపించి ఆర్‌సీబీ మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. ఇక రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌లో భాగంగానే ఏబీడీని ఆరో స్థానంలో పంపించామని కోహ్లీ చెప్పిన కారణంపై కూడా సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే వ్యూహం అనుకుంటే పడిక్కల్ ఔటైన తర్వాత కోహ్లీ ఎందుకు క్రీజులోకి వచ్చాడని ప్రశ్నించాడు. అలాగే సుంధర్‌కు క్రిస్ గేల్, యువరాజ్ సింగ్‌లా సిక్స్‌లు కొట్టే సామర్థ్యం ఉందా? అని నిలదీశాడు.

మూడో స్థానంలో ఎందుకు పంపలేదు?
‘బ్యాటింగ్ లైనప్‌లో చేసిన ప్రయోగాలే ఆర్‌సీబీ కొంపముంచాయి. ఇదే మైదానం వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 33 బంతుల్లో 73 రన్స్ చేశాడు. అలాంటి బ్యాట్స్‌మన్‌కు ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఇస్తే.. మరిన్ని రన్స్ చేస్తాడు. కానీ లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌లో భాగంగా ఏబీడీ డౌన్ ది ఆర్డర్ పంపించామంటున్నారు. అదే నిజమైతే వాషింగ్టన్ సుంధర్‌ను ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపలేదు. ఈ వ్యూహం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు'అని సెహ్వాగ్ క్రిక్ బజ్‌తో మాట్లాడుతూ కోహ్లీ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు.

నంబర్4లో ఆడే ఆటగాడా?
ఇక వాషింగ్టన్ సుంధర్ నంబర్ 4లో ఆడే ఆటగాడా? అని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ను వీరు ప్రశ్నించాడు. అంత నమ్మదగిన బ్యాట్స్‌మెన్ అని సుంధర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు నిరూపించుకోలేదని గుర్తు చేశాడు. ‘లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనుకున్నా..నాలుగో స్థానంలో ఆర్‌సీబీ ఓ మంచి బ్యాట్స్‌మన్‌ను పంపించలేకపోయింది. అసలు వారు ఏం ఆశించి చేశారో కూడా అర్థం కాలేదు. వారు పంపించిన లెఫ్టాండర్ ఎవరయ్యా అంటే వాషింగ్టన్ సుంధర్. అతను మంచి క్రికెటర్ కావొచ్చు. కానీ ఇప్పటివరకు అతను ధాటిగా ఆడగలనని నిరూపించుకోలేదు కదా? క్రిస్ గేల్,యువరాజ్ సింగ్‌లా సిక్స్‌లు కొట్టే సామర్థ్యం ఏమైనా అతనికి ఉందా?'అని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గేల్ రాకతో పంజాబ్ జిగేల్
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లీ (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కేఎల్ రాహుల్ (49 బంతుల్లో 61 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్ (45 బంతుల్లో 53; 1 ఫోర్ 5 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications