దారుణం.. ధోనీ బాగా ఆడకపోతే జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

న్యూఢిల్లీ: అభిమానం హద్దులు దాటుతుంది. పిచ్చి ముదిరి పైత్యంగా మారుతుంది. ఇన్నాళ్లు రాజకీయ, సినీ రంగానికే పరిమితమైన ఈ దిగాజారుడుతనం ఇప్పుడు క్రీడారంగానికి కూడా పాకింది. క్రికెట్ మ్యాచ్‌ల్లో బాగా రాణించకుంటే వారి కుటుంబ సభ్యులను రేప్ చేస్తమని బెదిరింపులకు దిగేంత విపరీత పోకడలకు దారీ తీసింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తుంటారు అభిమానులు. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది అభిమానం పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది.
చెన్నై ఓడటంతో..
భారత క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో గెలుపు దిశగా దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆఖర్లో తడబడి చేతులెత్తేసింది. మిడిల్ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ విఫలమవ్వగా.. క్రీజులో కడవరకు నిలిచినా కేదార్ జాదవ్ ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓడింది.
ఇంత దిగజారుడుతనమా.?
ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమికి జాదవ్ కారణమని ధోనీ అభిమానులు ట్రోల్ చేయగా.. ధోనీ కూడా ఏం తక్కవ కాదని, అతనికి కూడా అంతే బాధ్యత ఉందని మరికొందరు కామెంట్ చేశారు. విమర్శల వరకు ఈ ట్రోలింగ్ బాగానే ఉన్నా.. వ్యక్తిగత దూషణలకు దిగడం, కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తామని బెదరింపులకు దిగడం ఇప్పుడు అందరిని విస్మయపరుస్తోంది. ధోనీ కూతరు ఆరేళ్ల చిన్నారి జీవాపై విషం చిమ్ముతూ కొందరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ధోనీ సరిగ్గా ఆడనట్లయితే జీవాపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోనీ అభిమానులు, ఇతర నెటిజన్లు వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయరంటూ విరుచుకుపడుతున్నారు.
చెన్నైకి చేతకాలేదు
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవడం.. చివర్లో ధాటిగా ఆడకపోవడంతో మూల్యం చెల్లించుకుంది.
సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్ చేసే సత్తా లేదా? ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications