For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: దేవదత్ పడిక్కల్ స్లో బ్యాటింగే కోహ్లీసేన ఓటమికి కారణమా?

IPL 2020: Devdutt Padikkal slow batting cost RCB against DC

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో దూకుడు కనబర్చిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం చతికిలపడి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. కానీ మెరుగైన రన్‌రేట్‌తో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీసేన 6 వికెట్లతో ఓడినా టోర్నీలో ముందడుగువేసింది.

అయితే టేబుల్-2 ర్యాంక్‌ను మాత్రం చేజార్చుకుంది. గత నాలుగు మ్యాచ్‌లుగా ఆర్‌సీబీ బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా మూడు కారణాలు ఆర్‌సీబీని దెబ్బతీశాయి.

పడిక్కల్-కోహ్లీ స్లో బ్యాటింగ్..

పడిక్కల్-కోహ్లీ స్లో బ్యాటింగ్..

బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో రాణిస్తున్నా సరైన స్ట్రైక్‌రేట్ మెయింటేన్ చేయకపోవడం ఆ జట్టును కలవర పెడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఈ యువ ఆటగాడు.. గత కొన్ని మ్యాచ్‌లుగా నిదానంగా ఆడుతున్నాడు. భారీ షాట్లు ఆడేందుకు తడబడుతున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కూడా దేవదత్ స్లో బ్యాటింగే ఆర్‌సీబీ ఓటమికి కారణమైంది. యువరాజ్ స్టైల్లో బౌండరీలు బాదినా.. అవి మెరుగైన రన్‌రేట్ అందించలేకపోయాయి. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా నిదానంగా ఆడటం ఆర్‌సీబీ కొంపముంచింది. ఈ ఇద్దరు వన్డే తరహాలో 50 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం అందించడం ఆర్‌సీబీ సాధారణ స్కోర్‌కు పరిమితమయ్యేలా చేసింది. దాంతో పాటు కోహ్లీపై ఒత్తిడి పెరిగి ఔటయ్యేలా చేసింది.

పడిక్కల్ ఆఖరి వరకు ఆడకపోవడం..

పడిక్కల్ ఆఖరి వరకు ఆడకపోవడం..

ఇక 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న పడిక్కల్.. ఆఖరి వరకు క్రీజులో ఉండకపోవడం కూడా ఆ జట్టును దెబ్బతీసింది. అతను అదే ఇన్నింగ్స్ ఆడుడూ ఏబీడీకి అండగా నిలిచి ఉంటే.. ఆర్‌సీబీ 170కిపైగా పరుగుల చేసిది. కానీ పడిక్కల్ ఔటవ్వడం.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏబీడీకి ధాటిగా ఆడే స్వేచ్చలేకుండా పోయింది. శివమ్ దూబే పర్వాలేదనిపించడం.. ఏబీడీ ధాటైన ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ ఆ పరుగులైనా చేయగలిగింది. పడిక్కల్ తన శైలిని మార్చుకోకుంటే తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి కష్టాలు తప్పవు.

షేబాజ్ అహ్మద్ ఆలస్యంగా రావడం

షేబాజ్ అహ్మద్ ఆలస్యంగా రావడం

ఇక వికెట్లు తీసి విజయాలను అందించే యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్ తీయడం.. వికెట్లు తీసిన షేబాజ్ ఆలస్యంగా బౌలింగ్‌కు రావడంతో ఆర్‌సీబీ సాధారణ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. అయితే క్రిస్ మోరిస్ ధారళంగా పరుగులివ్వడం కూడా దెబ్బతీసింది. సిరాజ్ వికెట్ తీసిన వెంటనే మరో వికెట్ పడుంటే పరిస్థితి మరోలా ఉండేది. 11 వ ఓవర్‌లో బౌలింగ్ వచ్చి రెండు కీలక వికెట్లు తీసిన షెబాజ్‌ ముందు తీసుకొచ్చి ఉంటే ఫలితం ఉండేది. అతను బ్యాట్స్‌‌మన్‌‌ను ఒత్తిడికి గురి చేసేవాడు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా కట్టడి చేసి ఆఖరి వరకు తీసుకురావడంతో ఆర్‌సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో స్టోయినిస్ కొట్టిన సిక్సర్‌ను బౌండరీ లైన్ వద్ద చాహల్ పట్టి ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేది.

IPL 2020 Playoffs : DC, RCB Enter Playoffs, KKR-SRH Fate To Be Decided | Oneindia Telugu
గర్జించిన గబ్బర్..

గర్జించిన గబ్బర్..

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్‌ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. శిఖర్‌ ధావన్ ‌(54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్య రహానే (60: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) మెరుపు అర్ధ శతకాలతో రాణించారు. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రన్‌రేట్‌ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.

SRH vs MI: హైదరాబాద్ చేతిలో కోల్‌‘కథ'.. గెలిచి ప్లే ఆఫ్స్‌‌కు వెళ్తుందా?.. ఓడి దారిస్తుందా?

Story first published: Tuesday, November 3, 2020, 10:42 [IST]
Other articles published on Nov 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+