Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR: రాయల్స్ రఫ్ఫాడించెనా? ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకునేనా?

IPL 2020, DC vs RR: Who will win Delhi Capitals vs Rajasthan Royals

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ చేరికతో బలంగా తయారైన రాజస్థాన్‌‌ రాయల్స్‌‌.. లీగ్‌‌లో టాప్‌‌ పెర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌ రెండోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. బుధవారం దుబాయ్ వేదికగా జరిగే ఈ‌ మ్యాచ్‌‌లో ఢిల్లీని ఓడించి ఫస్ట్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. గత వారం ఈ రెండు టీమ్స్‌‌ మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 46 రన్స్‌‌ తేడాతో రాయల్స్‌‌ను చిత్తు చేసింది.

ఇప్పటిదాకా లీగ్‌‌లో మూడు విజయాలు సాధించిన రాజస్తాన్‌‌కు ఈ మ్యాచ్‌‌లో విజయం అత్యవసరం. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి ముంబై బ్రేక్‌లు వేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు సేఫ్‌గా వెళ్లాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది. మరీ విజయం ఏ జట్టును వరిస్తోందో చూడాలి!

రెట్టింపు అయిన రాజస్థాన్ బలం..

రెట్టింపు అయిన రాజస్థాన్ బలం..

ఢిల్లీతో ఆడిన లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌కు స్టోక్స్‌‌ లేడు. అతని రాకతో జట్టు బలం రెట్టింపు అయింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సన్‌‌ రైజర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో బరిలోకి దిగిన స్టోక్స్‌‌ ఫెయిలైనప్పటికీ రాజస్తాన్‌‌ అతనిపై చాలా నమ్మకంగా ఉంది. స్టోక్స్‌‌ జట్టులో ఉన్నప్పటికీ రాజస్తాన్‌‌ టాపార్డర్‌‌ గాడిలో పడకపోతే ఇబ్బంది తప్పదు. సీజన్‌‌ స్టార్టింగ్‌‌లో అదరగొట్టిన స్మిత్‌‌, శాంసన్‌‌ వరుసగా ఫెయిలవుతున్నారు. బట్లర్‌‌ ఫామ్‌‌లో ఉన్నప్పటికీ ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు. రాహుల్‌‌ తెవాటియా మరోసారి కీలకం కానున్నాడు. ఆర్చర్‌‌, కార్తీక్‌‌ త్యాగి, అంకిత్‌‌ రాజ్‌‌పుత్‌‌ తదితరులతో బౌలింగ్‌‌లో రాజస్తాన్‌‌ ఫర్వాలేదనిపిస్తోంది. కానీ ఢిల్లీ బ్యాట్స్‌‌మెన్‌‌కు కళ్లెం వేయాలంటే వారు మరింత చెలరేగాలి. జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

 కలవరపెడుతున్న పంత్ గాయం..

కలవరపెడుతున్న పంత్ గాయం..

ముంబైతో మ్యాచ్‌కు ముందు వరకు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ.. రిషభ్ పంత్ గాయంతో జట్టుకు దూరమవడంతో ఒక్కసారిగా ఢీలా పడింది. అతని గైర్హాజరీతో జట్టు సమతూకం దెబ్బతిన్నది. పంత్ స్థానంలో అజింక్యా రహానే వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ కోసం హెట్‌మైర్ పక్కన పెట్టి అలెక్స్ క్యారీ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో టీమ్ బ్యాలెన్స్ తప్పింది. అయితే శిఖర్‌‌ ధవన్‌‌ ఫామ్‌‌లోకి రావడం, పృథ్వీ, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ టచ్‌‌లో ఉండడంతో ఢిల్లీ టాపార్డర్‌‌ బలంగానే ఉంది. రిషబ్‌‌ పంత్‌‌ ఈ మ్యాచ్‌‌కు కూడా దూరమవ్వడంతో అలెక్స్‌‌ క్యారీ, హెట్‌‌మయర్‌‌లో అయ్యర్‌‌ ఎవరిని తీసుకుంటాడో, రహానెకు ఇంకో చాన్స్‌‌ ఇస్తాడో లేదో చూడాలి. కగిసో రబడా, నోర్జ్, అశ్విన్, అక్షర్ పటేల్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.

ముఖా ముఖి

ముఖా ముఖి

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచ్ లు జరగ్గా రాజస్తాన్‌ 11-10తో లీడ్ లో ఉంది. అయితే ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ 46 రన్స్‌‌ తేడాతో రాయల్స్‌‌ను చిత్తు చేసింది. గత సీజన్‌లో కూడా ఢిల్లీనే రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరి నాలుగు మ్యాచ్ ల్లో ఢిల్లీ 3 గెలవగా.. రాజస్థాన్ ఒకటి గెలుపొందింది.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఫేవర్‌గా ఉంటుంది. క్రీజులో ఓపికగా ఆడితే పరుగులు తీయవచ్చు. ఇక్కడ రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 మ్యాచ్‌ల్లో 11 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కింగ్స్ పంజాబ్‌తోనే చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ మాత్రమే చేజింగ్ ‌లో విజయాలనందుకున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచింది. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాజస్థాన్ ఒకటి గెలిచి మరొకటి ఓడింది. ఇక టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు

తుది జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, హర్షల్ పటేల్, అశ్విన్, రబడా, అన్రిచ్ నోర్జ్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప/యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగీ, జయదేవ్ ఉనాద్కత్

కంగ్రాట్స్ నట్టూ.. ధోనీ వికెట్ తీయాలనే లక్ష్యాన్ని అందుకున్నావ్‌గా..!

Story first published: Wednesday, October 14, 2020, 15:08 [IST]
Other articles published on Oct 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+