
కోహ్లీపైనే అందరిచూపు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఢిల్లీతో అదే ఫామ్ కనబర్చాడు. దీంతో అందరి చూపు అతనిపైనే ఉంది. యువ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్, ఫించ్ డివిలియర్స్ మంచి ఫామ్‌లోనే ఉండగా... ఢిల్లీతో గత మ్యాచ్‌లో ఈ ముగ్గరు విఫలమయ్యారు.
మిడిలార్డర్ బలహీనంగానే ఉంది. టాపార్డర్‌లో ఏ ఇద్దరు చెలరేగిన ఆర్‌సీబీకి తిరుగుండదు.
ఐదింటిలో మూడు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఇక సీఎస్‌కే ఐదింటిలో రెండే గెలిచి ఆర్‌సీబీ తర్వాతి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ఓటమి ముంగిట చేతులెత్తేసిన చెన్నై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి విజయాల బాటపట్టాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరీ ఈ రామలక్ష్మణుల పోరులో ఎవరు గెలుస్తారో? చూడాలి.

ఒత్తిడిలో చెన్నై..
చెన్నైకి ఫామ్ పరంగా తమ కంటే చాలా మెరుగ్గా కనిపిస్తున్న ఆర్‌సీబీ నుంచి గట్టిపోటీ తప్పదు. కోల్‌కతాతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో విజయం ముంగిట దాకా వచ్చి ఓడిన చెన్నై టీమ్ బ్యాటింగ్ లైనప్‌కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తోంది. దీంతో ఆ జట్టు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. అంత మాత్రానా డాడీస్ ఆర్మీని తక్కువ అంచనా వేయలేం. లాస్ట్ పెర్ఫామెన్స్ తర్వాత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌పై వేటు పడడం ఖాయమే. షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ మంచి టచ్‌లో ఉండగా.. రాయుడు కూడా కుదురుకుంటే తిరుగుండదు. డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్ చెలరేగితే ఆర్‌సీబీకి కష్టాలు తప్పవు. ఫినిషర్‌గా ధోనీ తన మార్క్ చూపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. గత మ్యాచ్‌ల్లో బౌలర్లు చెలరేగి ప్రత్యర్థిని కట్టడి చేశారు. జాదవ్ వద్దనుకుంటే రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కవచ్చు.

తుది జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), గుర్‌క్రీత్ సింగ్/మహ్మద్ సిరాజ్, శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్/రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా

పిచ్ రిపోర్ట్:
పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఫేవర్‌గా ఉంటుంది. క్రీజులో ఓపికగా ఆడితే పరుగులు తీయవచ్చు. ఇక్కడ రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 10 మ్యాచ్‌ల్లో 9 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కింగ్స్ పంజాబ్‌తోనే చెన్నై 10 వికెట్లతో విజయాన్నందుకుంది. ఇప్పటి వరకు చెన్నై ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒకటే గెలిచింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ మాత్రం రెండు గెలిచి రెండు ఓడింది. ఈ రెండు కూడా చేజింగ్‌లోనే పరాజయం పాలైంది. కాబట్టి టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ తీసుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖాముఖి..
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడగా 15-8తో చెన్నై లీడ్‌లో ఉంది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి.
RR vs DC: రిషభ్ పంత్ నిర్లక్ష్యపు రనౌట్.. కామెంటేటర్ల మధ్య వాగ్వాదం!


Click it and Unblock the Notifications












