IPL 2020: ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవదు అనడానికి మూడు బలమైన కారణాలు!

హైదరాబాద్: ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం...ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ శైలి ఇది. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఏడు సీజన్లలో ఏకంగా నాలుగు టైటిల్స్ నెగ్గింది. ఈ నాలుగు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే. లీగ్‌లోనే బలమైన జట్టు, విజయవంతమైన కెప్టెన్, గొప్ప సహాయక సిబ్బంది ఉన్నప్పటికీ ముంబై ఒక్కసారి కూడా వరుసగా టైటిల్ నెగ్గలేదు.
నాలుగు టైటిల్స్‌నూ వేర్వేరు సీజన్లలోనే నెగ్గింది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో కూడా తమ స్లో స్టార్టర్ పేరును నిలబెట్టుకుంటూ ఓటమితో ప్రారంభించిన ముంబై.. ఆ తర్వాత ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతుంది. 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ జట్టు జోరు చూస్తుంటే ప్లే ఆఫ్‌కు సులువుగా చేరుతుందనిపిస్తుంది. ఒకవేళ ప్లే ఆఫ్ చేరినా టైటిల్ మాత్రం నెగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఓ మూడు బలహీనతలు ఆ జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

మిడిల్ ఓవర్లలో నెమ్మదైన బ్యాటింగ్
ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు పవర్ హిట్టర్స్ కీలక పాత్ర పోషించారు. చివర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు అందించారు. టాపార్డర్ చెలరేగినా హిట్టర్ల సాయంతోనే ముంబై భారీ స్కోర్లు చేసింది. అయితే టాపార్డర్, లోయార్డర్ బలంగా ఉన్నా.. మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనబడుతుంది. మరీ ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆ జట్టు పూర్తిగా తెలిపోతుంది. ఎవరూ క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోతున్నారు. ఇది ఆ జట్టును కలవరపెడుతుంది. ప్రధానంగా 12 నుంచి 16 ఓవర్ల మధ్యలో స్కోర్ వేగం మందగిస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ప్రారంభం మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో 33 పరుగులు చేసిన ఆ జట్టు.. రెండు వికెట్లు కోల్పోయింది. కేకేఆర్‌తో 42 రన్స్ చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఇలా గత ఆరు మ్యాచ్‌ల్లో యావరేజ్‌గా 30 పరుగులు మాత్రమే చేసింది. ఈ కారణంగానే ఆరంభంలో లభించిన శుభారంభాన్ని కొనసాగించలేకపోతుంది. చివర్లో పవర్ హిట్టర్లు చెలరేగుతుండటంతో గట్టెక్కుకుంటు వచ్చిన ముంబై.. వారు చేతులెత్తేస్తే.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేది. ఈ బలహీనతను అధిగమించకపోతే ముంబై భారీ మూల్యమే చెల్లించుకుంటుంది.

ఫస్ట్ బ్యాటింగ్‌కే ప్రాధాన్యత
ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలోనూ తొలుత బ్యాటింగ్ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఒక్క మ్యాచ్‌లో మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసి ఓటమిపాలైంది. ఒత్తిడికి చిత్తవుతూ టాపార్డర్ విఫలమైన వేళ... ఇషాన్ కిషాన్(99) అద్భుత ఇన్నింగ్స్‌తో సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో గెలవలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్ల వైఫల్యం కూడా ఆ మ్యాచ్‌లో ముంబైకి కలిసొచ్చింది.
గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లోను తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ చేయడం.. ఆ తర్వాత ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయాలనందుకుంది. కోల్‌కతా, కింగ్స్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో గెలిచిన ముంబై.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో 190కి పైగా పరుగులు హిట్టర్ల సాయంతోనే చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేసి విజయాన్నందుకుంది. అయితే చేజింగ్‌లో మాత్రం ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అదే దూకుడును కనబర్చలేకపోతున్నారు. ఒత్తిడికి చిత్తవుతూ చేతులెత్తేస్తున్నారు. ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఇదే స్పష్టమైంది. ఇది కూడా ఆ జట్టుకు బలహీనతగా మారింది.

స్ట్రాంగ్ బౌలింగ్ బెంచ్ లేకపోవడం..
జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ ఇరగదీస్తున్నారు. మేటి స్పిన్నర్లు లేకున్నా తమ సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరూ గాయపడ్డా.. వారిని భర్తీ చేసే ఆటగాడు బెంచ్‌పై లేకపోవడం ఇప్పుడు ఆ జట్టును కలవరపెడుతుంది. నాథన్ కౌల్టర్ నీల్, మిచెల్ మెక్లిన్‌గన్, ధావల్ కులకర్ణిలు ఉన్నా.. వారు బుమ్రా, బౌల్ట్ స్థాయిలో రాణించలేరు. ఇప్పటికే లీగ్‌లో ముగ్గురు బౌలర్లు గాయాలతో దూరమయ్యారు. మిచెల్ మార్ష్(హైదరాబాద్), భువనేశ్వర్ కుమార్(హైదరాబాద్), అమిత్ మిశ్రా(ఢిల్లీ) గాయాలతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితే ముంబైకి వస్తే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. ఇక అన్ని జట్లలో స్పిన్నర్లు మార్క్ పెర్ఫామెన్స్ చూపిస్తుంటే ఈ జట్టులోని స్పిన్నర్లు మాత్రం ఒక్క విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చలేదు. ఇది కూడా ఆ జట్టుకు సమస్యగా మారనుంది.
RR vs DC: రిషభ్ పంత్ నిర్లక్ష్యపు రనౌట్.. కామెంటేటర్ల మధ్య వాగ్వాదం!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications