
పరిస్థితులును తప్పుగా అంచనా వేయడం..
షార్జా గ్రౌండ్ చిన్నది కావడంతో.. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఇక్కడ సిక్సర్ల మోత మోగించారు. పంజాబ్ విసిరిన 224 రన్స్ లక్ష్యాన్ని చేధించి మరీ.. రాజస్థాన్ ఇదే వేదికపై విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకూ షార్జాలో జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ 200పై చిలుకు పరుగులు చేశాయి. కానీ ఈ మ్యాచ్‌లో పిచ్ అనూహ్యంగా స్పందించింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితులను తప్పుగా అంచనా వేసిన రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. బలహీనంగా మారిన బ్యాటింగ్ లైనప్‌తో చేజింగ్ చేయాలనుకోవడం ఆ జట్టు కొంపముంచింది. తొలుత బ్యాటింగ్ చేసుంటే రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేవారు. అప్పుడు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచే అవకాశం ఉండేది. లక్ష్య చేధనలో ఢిల్లీపై ఒత్తిడి ఉండేది. కానీ ఢిల్లీని 184 రన్స్‌కే పరిమితం చేసినా.. ఒత్తిడికి చిత్తయిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.

ఆర్చర్‌తో బౌలింగ్ చేయించకపోవడం..
రాజస్థాన్ ప్రధాన బౌలింగ్ అస్త్రం జోఫ్రా ఆర్చర్‌ను కూడా రాజస్థాన్ సరిగ్గా వాడుకోలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్ స్మిత్ ఈ విషయంలో విఫలమయ్యాడు. ఢిల్లీ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అందులో రెండు వికెట్లు ఆర్చర్ తీసినవి కాగా.. ఒకటి రనౌట్. అద్భుతంగా బంతులేస్తన్న ఆర్చర్‌ను రెండు ఓవర్లు వేయగానే స్మిత్ పక్కనబెట్టాడు. మళ్లీ 18, 20వ ఓవర్లు బౌలింగ్ చేయించాడు. కానీ మధ్యలో స్టోయినిస్, హెట్‌మైర్ చెలరేగుతున్నప్పుడు ఆర్చర్‌తో బౌలింగ్ చేయించి ఉంటే.. ఢిల్లీ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. అప్పుడు రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలు ఉండేవి.

కొనసాగిన బ్యాటింగ్ వైఫల్యం..
గత నాలుగు మ్యాచ్‌ల్లో స్మిత్ సేన ఓటమికి ప్రధాన కారణం.. ఆ జట్టు టాపార్డర్ విఫలమవడం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ధాటిగా ఆడిన ఆ జట్టు టాపార్డర్ ఆ తర్వాత చేతులెత్తేసింది. నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించుకుంది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూడా గందరగోళంగా ఉంది. టాపార్డర్ ఏ ఒక్కరు నిలిచినా లక్ష్యాన్ని సమీపించేది. రాజస్థాన్ జట్టులో టాప్ స్కోరర్ రాహుల్ తెవాటియా (38). ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తెవాటియా తర్వాత ఎక్కువ పరుగులు చేసింది జైస్వాల్ (34). బట్లర్, స్మిత్, శాంసన్ లాంటి ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. సంజూ శాంసన్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఢిల్లీ బౌలర్లు ముందు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. టాపార్డర్ చెలరేగితే కానీ రాజస్థాన్ విజయాలందుకోలేదు.

అశ్విన్ మాయ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
బౌండరీ సైజ్ తగ్గించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సీఎస్‌కే రిక్వెస్ట్!


Click it and Unblock the Notifications












