గౌతమ్ గంభీర్‌కు కుల్దీప్ యాదవ్ బర్త్‌డే విషెస్.. దినేశ్ కార్తీక్‌పై అసంతృప్తే అంటున్న ఫ్యాన్స్!

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ బుధవారంతో 39వ ఏట అడుగుపెట్టాడు. దాంతో ఈ క్రికెటర్ కమ్ పొలిటిషియన్‌కు అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తన మాజీ కెప్టెన్‌కు తనదైన శైలిలో బర్త్‌డే విషెస్ చెప్పాడు.
అయితే గంభీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే సాకుతో కుల్దీప్ ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై తన అసంతృప్తిని వెళ్లగక్కాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. డీకేపై తనకున్నఅసహనాన్ని తెలియజేశాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. దాంతో కుల్దీప్ బర్త్‌డే విషెస్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గంభీర్‌తో కలిసి భారత జట్టుకు ఆడకపోయినా.. అతని కెప్టెన్సీలోనే కుల్దీప్ రాటుదేలాడు.
గంభీర్ సారథ్యంలోనే అరంగేట్రం..
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. తన సూపర్ కెప్టెన్సీతో జట్టుకు రెండు టైటిళ్లు అందించాడు. ఇక అతని హయాంలోనే 2016 సీజన్‌లో కుల్దీప్ ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. 2017లో 12 మ్యాచ్‌లు ఆడి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇక 2018లో గంభీర్‌కు కోల్‌కతా నుంచి తప్పుకొని ఢిల్లీకి ఆడటం.. ఆతర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
నమ్మకం ఉంచేవాడు..
గంభీర్ లేకపోవడంతో జట్టులో కుల్దీప్ ప్రభావం కూడా తగ్గింది. దాంతో గంభీర్ ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచేవాడని బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.‘గంభీర్ బాయ్ నాపై ఎప్పుడూ నమ్మకం ఉంచేవాడు. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నా. హ్యాపీ బర్త్‌డే గంభీర్ బాయ్. నీపై ఆ దేవుణి దీవెనలు ఉండాలి'అంటూ తనదైన శైలిలో విషెస్ చెప్పాడు.
డీకేపై అసంతృప్తే కదా!
ఇక ఈ ట్వీట్‌ను చూసిన అభిమానులు.. కుల్దీప్ చాలా తెలివైనోడని, దినేశ్ కార్తీక్‌పై ఉన్న అసంతృప్తిని గంభీర్ బర్త్‌డే విషెస్‌లో వెళ్లగక్కాడని కామెంట్ చేస్తున్నారు. ‘దినేశ్ కార్తీక్ నీపై నమ్మకం ఉంచలేదంటావ్.. అంతేగా కుల్దీప్'అని ఒకరంటే.. ‘నీ విలువ తెలియాలంటే.. గంభీర్, మోర్గాన్ వంటి వారు కేకేఆర్ ను నడిపించాలి'అని మరొకరు కామెంట్ చేశారు. ఇక డీకే తన స్టేట్ స్పిన్నర్‌కే అవకాశాలు ఇస్తున్నాడని మండిపడుతున్నారు.

మూడే మ్యాచ్‌లు..
టీమిండియా స్టార్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌కు ఈ సీజన్‌లో మూడే మ్యాచ్‌ల్లో అవకాశం దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించలేకపోయిన కుల్దీప్.. ఒకే ఒక వికెట్ తీసాడు. దాంతో తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశాలు రావడం లేదు. పైగా అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాగా రాణిస్తుండటం.. అతని కెప్టెన్ దినేశ్ కార్తీక్ అండ ఉండటంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. గత సీజన్‌లో కూడా కుల్దీప్ 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
DC vs RR: రాయల్స్ రఫ్ఫాడించెనా? ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకునేనా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications