IPL 2020 : సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరేది ఇలా.. ఆఖరి అవకాశం!

హైదరాబాద్: జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ ఘనంగా ప్రారంభై ముగింపు దశకు కూడా చేరుకొంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం ప్లేఆఫ్స్ రేసులో నాలుగో బెర్త్ కోసం త్రిముఖ పోరు కొనసాగుతోంది. టాప్-3 టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయం కాగా.. చివరి స్థానం కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివార జరిగిన మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోర్లా పడ్డ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దాదాపు అవకాశాలను సన్నగిల్లినా.. మెరుగైన రన్ రేట్ కారణంగా ఓ అద్భుతం జరిగితే ఆరెంజ్ ఆర్మీ టోర్నీలో ముందుకు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించాయి.

మూడు మ్యాచ్‌లకు 3 గెలిచి..
ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఏడింటిలో ఓడింది. 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. కోల్‌కతా, పంజాబ్‌కు తదుపరి మూడు మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు ఎదురై.. హైదరాబాద్ మూడింటికి మూడు గెలిస్తే 14 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్‌కు దూసుకెళ్తుంది. అదే 14 పాయింట్లతో సమంగా నిలిచినా నెట్ రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కే అవకాశాలుంటాయి. అయితే హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లను టాప్-3 టీమ్స్ ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆరెంజ్ ఆర్మీ ఈ మూడు మ్యాచ్‌లు గెలవడం అసంభవమే.

పంజాబ్ పంజా విసిరాల్సిందే..
తొలి అంచె పోటీల్లో వరుస పరాజయాలతో అట్టడుగు స్థానానికి పరిమితమైన కింగ్స్ పంజాబ్ అసాధారణ ఆటతీరుతో అద్భుత విజయాలను అందుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో కూడా అదే జోరు కొనసాగితేనే.. ఆ జట్టుకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి. తమ తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్ కేకేఆర్, చెన్నై, రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ మూడింటిలో విజయం సాధిస్తేనే టోర్నీ కొనసాగే అవకాశం ఉంటుంది. మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా ఒక్కటి ఓడినా పంజాబ్ నిష్క్రమించాల్సిందే.

కోల్‌కతా గెలవాలి..
సీజన్ ప్రారంభం నుంచి కేకేఆర్ ఆట ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనకకు అన్నట్లు సాగింది. 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే టాప్-2లో చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడితే.. పంజాబ్ లేదా సన్‌రైజర్స్ మిగతా మ్యాచ్‌లన్నీ ఓడాల్సి ఉంటుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన పంజాబ్‌తో కోల్‌కతా సోమవారం తలపడనుంది. ఆ మ్యాచ్ తర్వాత చెన్నై, రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Best Franchise Owner: విజయానందంలో ఆటగాళ్లను ముద్దులతో ముంచెత్తిన ప్రీతీ జింటా! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications