
హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సత్తా చాటింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సేన 12 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా దక్కిన విజయంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ ప్రీతీ జింటా సంతోషానికి హద్దేలేకుండా పోయింది. దుబాయ్‌లో దగ్గరుండి తమ జట్టు విజయాలను ఆస్వాదిస్తున్న ఈ సొట్టబుగ్గల సుందరి.. హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత ఎగిరి గంతేసింది. తమ ఆటగాళ్లను ఫ్లైయింగ్ కిస్‌లతో ముంచెత్తింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
కరోనాను సైతం లెక్క చేయకుండా దుబాయ్‌కు వచ్చిన ప్రీతీ జింటా.. స్టాండ్స్‌లో తమ జట్టుకు మద్దతు తెలుపుతూ అభిమానులను అలరిస్తోంది. తన అందం, అభినయంతో పిచ్చెక్కిస్తోంది. ఫలితాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఆ ఫ్రాంచైజీ అభిమానులకు అండగా నిలుస్తోంది. అంతేకాకుండా కరోనా క్వారంటైన్ కష్టాలను పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సొట్టబుగ్గల సుందరిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Best Franchise Owner అంటూ జింటాను కొనియాడుతూ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌కు ముందు తర్వాత ఆమె హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలుస్తున్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' క్రిస్ జోర్డాన్ (3/17), అర్ష్ దీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.