
ఇదే తొలిసారి కాదు..
సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదు. ఇదివరకు 2015 నవంబర్‌లో వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటన సందర్భంగా అతని బౌలింగ్‌పై తొలిసారిగా అనుమానాలు మొదలయ్యాయి. పల్లెకెలెలో జరిగిన వన్డేలో సందేహాస్పదంగా అతను బంతులను సంధించినట్లు ఫిర్యాదులొచ్చాయి. అంతకుముందు-2014లో టీ20 చాంపియన్స్ లీగ్‌లోనూ అతను ఇవే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. ఆ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు మరోసారి అవే అనుమానాలు అతణ్ని చుట్టుముట్టాయి.

షరుతులతో కూడిన అనుమతి..
2016లో ఐసీసీ అతని బౌలింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. 2018లో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే క్రమంలో మరోసారి అతని బౌలింగ్‌పై ఫిర్యాదు వచ్చింది. టీ20 లీగ్‌లోనూ నరైన్‌కు బీసీసీఐ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో కోల్‌కతా యాజమాన్యం అతడ్ని జట్టులోకి తీసుకుంది. బీసీసీఐ సూచనల మేరకు నరైన్ తన బౌలింగ్ శైలి మార్చుకొని బౌలింగ్ చేస్తున్నాడు. ఆ కారణంగా అతను మునుపటిలా బౌలింగ్‌లో ప్రభావం చూపించలేకపోతున్నాడన్న వాదన కూడా ఉంది.
ఆఖరి ఓవర్‌లో అనుమానాస్పద బౌలింగ్
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ కీలకమైన రెండు వికెట్లను తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా 18, 20వ ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ కట్టడి చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన సునీల్.. 28 పరుగులు ఇచ్చాడు. నికొలస్ పూరన్, మన్‌దీప్ సింగ్‌లను పెవిలియన్ పంపించగలిగాడు. అదే సమయంలో అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకూ 347 టీ20 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 390 వికెట్లు తీశాడు. టీ20 లీగ్‌లో అతను 116 మ్యాచ్‌లాడి 127 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 6.74గా ఉంది. ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన నరైన్ బౌండరీలు కూడా అలవోకగా బాదగలడు.

కోల్‌కతా ఛీటింగ్.. నరైన్ తొండాట..
ఇక గెలుపు ముంగిట కింగ్స్ పంజాబ్ ఓడిపోవడంతో తీవ్ర బాధలో ఉన్న ఆ ఫ్రాంచైజీ అభిమానులు.. నరైన్‌పై ఫిర్యాదు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ చీట్ చేసి గెలిచిందంటూ మండిపడుతున్నారు. నరైన్ తొండాట ఆడడాడని, చివరి ఓవర్‌లో నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications

CSK vs RCB: చెన్నై కొంపముంచిన ఘోర తప్పిదాలు ఇవే!