For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: చెన్నై కొంపముంచిన ఘోర తప్పిదాలు ఇవే!

 IPL 2020: 3 Mistakes committed by the Chennai Super Kings against Royal Challengers Bangalore

హైదరాబాద్: పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్​.. ఓసారి సెమీస్​... మరోసారి ప్లే ఆఫ్స్​.. ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జైత్రయాత్ర ఇది..! స్పాట్​ ఫిక్సింగ్​ మకిలి అంటుకున్నా... రెండేళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా... ఆట పరంగా మాత్రం సీఎస్​కే స్థాయి ఎవరెస్ట్ ​..! మిగతా ఫ్రాంచైజీల మాదిరిగా వరల్డ్​ క్లాస్​ సూపర్​ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్​ ప్లేయర్లు లభించక పోయినా.. యంగ్​ గన్స్​ అండ దొరకకపోయినా... కేవలం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల ఎక్స్​పీరియెన్స్​తోనే టైటిల్స్​ను కొల్లగొట్టడం చెన్నై స్పెషాలిటీ..! మరీ ముఖ్యంగా కూల్​ కెప్టెన్​ మహేంద్రుడి మాయాజాలం.. చెన్నైకి అన్నిటింకంటే పెద్ద మహిమ..! ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న చెన్నై ఐపీఎల్ 2020 సీజన్‌లో తేలిపోతుంది. మహీ మహిమలు బెడిసి కొడుతున్నాయి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయమే ఎదురైంది. కింగ్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ ముందు చెన్నై తేలిపోయింది. 37 పరుగులతో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మూడు ఘోర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

ఆఖర్లో పరుగులు ఇచ్చుకోవడం..

ఆఖర్లో పరుగులు ఇచ్చుకోవడం..

చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించారు. పిచ్ నుంచి లభించిన సహకారంతో చెలరేగారు. ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. వారి ధాటైన బౌలింగ్‌కు కోహ్లీసేన 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 రన్స్ మాత్రమే చేసింది. రన్ రేట్ 6 కూడా లేదు. అప్పటికే ఫించ్, పడిక్కల్, డివిలియర్స్ పెవిలియన్ చేరారు. కోహ్లీ ఒక్కడే క్రీజ్‌లో ఉన్నాడు. ఈ దశలో ఆర్‌సీబీ 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ కింగ్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌కు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. చివరి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులిచ్చుకున్నారు. దాంతో 150 పరుగుల కంటే తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించిన ఆర్‌సీబీ.. 169 రన్స్ చేసింది. ఇది చెన్నైని దెబ్బతీసింది.

రక్షణాత్మక ధోరణిలో టాప్ ఆర్డర్..

రక్షణాత్మక ధోరణిలో టాప్ ఆర్డర్..

బ్యాటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బలం టాపార్డర్. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లే 169 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం చెన్నై టాపార్డర్ రక్షణాత్మక ధోరణిలో ఆడారు. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలోనే చెన్నై ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు, అరంగేట్ర ఆటగాడు జగదీశ్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. దాంతో సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. చివర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడి నెలకొనేలా చేసింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పాడు. ఔటైనా పర్లేదు కానీ భారీ షాట్లు ఆడాలన్నాడు.

గెలవాలనే తపన లేకపోవడం..

గెలవాలనే తపన లేకపోవడం..

ఈ సీజన్‌లో చెన్నై తమ శైలికి భిన్నంగా ఆడుతుంది. గతంలో ఓడే మ్యాచ్‌ల్లో కూడా అద్భుతాలు చేస్తూ విజయాలందుకున్న ఆ జట్టు ఇప్పుడు మాత్రం గెలిచే మ్యాచ్‌ల్లో కూడా రాణించలేకపోతుంది. మరీ ముఖ్యంగా సమష్టిగా చెలరేగపోతుంది. బౌలింగ్‌లో రాణిస్తే.. బ్యాటింగ్‌లో విఫలమవుతుంది. ధోనీ నిర్ణయాలు కూడా మునుపటిలా పనిచేస్తలేవు. నిన్నటి మ్యాచ్‌లో కూడా గెలవాలనే కసి ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. ముందే చేతులెత్తేస్తున్నారు. దీంతో చివర్లో చెన్నై ప్రదర్శన సాదాసీదాగానే ఉంటోంది. చెన్నై విజయాలు సాధించాలంటే.. జట్టులో గెలవాలనే కసి.. బలంగా ఉండాలి. ఆటగాళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మరీ మిగాతా మ్యాచ్‌ల్లోనైనా ఏం చేస్తోందో చూడాలి.

కింగ్ కోహ్లీ చెలరేగాడు..

కింగ్ కోహ్లీ చెలరేగాడు..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్‌ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్‌ 3, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశారు.

Story first published: Sunday, October 11, 2020, 11:06 [IST]
Other articles published on Oct 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+