KXIP vs DC: మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. చాంపియన్లు చేయకూడని తప్పిదాలు!

హైదరాబాద్: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు కష్టమే అనుకున్న దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పంజా విసురుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో పంజాబ్ అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్ రేసులో ఉన్నామని ప్రత్యర్ధులకు హెచ్చరికలు జారి చేసింది.
అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయ శతకంతో చెలరేగినా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టును సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కీలక వికెట్లు కోల్పోయినా పూరన్, గేల్ మెరుపులతో పాటు మ్యాక్స్‌వెల్ బాద్యాతాయుత ఇన్నింగ్స్‌తో గెలుపొందింది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తేలిపోయిన ఢిల్లీ మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఆ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

టర్నింగ్ పాయింట్..
రవిచంద్రన్ అశ్విన్ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని పూరన్..షార్ట్ కవర్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి శిఖర్ చేతిలో పడటంతో నాన్‌స్ట్రైకర్ మ్యాక్స్‌వెల్ నిరాకరించాడు. దీంతో పూరన్ వెనక్కు తిరగ్గా.. బంతిని అందుకున్న పంత్ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. సింపుల్ ఔట్ చేసేదాన్ని క్లిష్టంగా కిందపడి కొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో రనౌట్ చేజారడంతో పాటు మరో ఎక్స్‌ట్రా రన్ వచ్చింది. అప్పుడు పూరన్ స్కోర్ 10 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో చెలరేగిన అతను 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఢిల్లీకి చేయాల్సిన నష్టం చేశాడు. దీనికి తోడు ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా తప్పిదాలు చేసింది.

శిఖర్ ఒక్కడే..
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ ఒక్కడే అజేయ శతకంతో రాణించాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా ఎదురు దాడికి దిగిన ధావన్ 170కిపైగా స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. కానీ మరో ఎండ్‌లో అతనికి సహకరం లభించలేదు. అతను దూకుడైన బ్యాటింగ్‌కు ఓ దశలో ఢిల్లీ 170-190 పరుగులు చేస్తుందనిపించింది. కానీ స్లాగ్ ఓవర్లలో వికెట్ల కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధావన్ ఒక్కడే 61 బంతుల్లో 106 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ కలిసి 59 బంతుల్లో 64 రన్స్ చేశారు. మరో 10 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

గేల్ X అశ్విన్ పోరు ఆలస్యం..
యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. వీరిద్దరూ 11 సార్లు తలపడగా.. అశ్విన్ 5 సార్లు ఔట్ చేశాడు. అతని బౌలింగ్‌లో బాస్ ఎప్పుడూ ఇబ్బంది పడుతుంటాడు. అయినప్పటికీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అశ్విన్‌తో బదులు యువ పేసర్ తుషార్ దేశ్‌పాండ్‌తో బౌలింగ్ చేయించి భారీ మూల్యం చెల్లించకున్నాడు. ఈ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్ బౌలింగ్ చేసిన అశ్విన్ గేల్‌ను బౌల్డ్ చేశాడు. గేల్ క్రీజ్‌లోకి రాగానే అశ్విన్ చేతికి బంతిని అందిస్తే ఈ నష్టం జరిగేది కాదు.

రబడాను ముందే దించాల్సింది..
క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌ను త్వరత్వరగా పెవిలియన్ చేరడంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఈ సమయంలో పంజాబ్‌పై మరింత ఒత్తిడి పెంచేలా ఢిల్లీ వ్యవహరించాల్సింది. క్రీజులో నిలదొక్కకుంటున్న పూరన్‌ను ఔట్ చేసే ప్రయత్నం చేయాల్సింది. రబడాతో బౌలింగ్ చేయిస్తే ఫలితం ఉండేది.
కానీ రబడాతో అయ్యర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చిన రబడా.. తర్వాత మళ్లీ 13 ఓవర్ బౌలింగ్‌కు దిగి పూరన్‌ను ఔట్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేయగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అందుకే ఓడాం.. ధావన్ ఇన్నింగ్స్ సూపర్: శ్రేయస్ అయ్యర్