న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌండరీ సైజ్ తగ్గించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సీఎస్‌కే రిక్వెస్ట్!

CSK requests IPL governing council to reduce boundary size in Dubai and Abu Dhabi grounds

దుబాయ్: దుబాయ్, అబుదాబి మైదానాల బౌండరీల దూరాన్ని తగ్గించాలని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను విజ్ఞప్తి చేసింది. ఆ మైదానాల్లో ఉన్న వేడి పరిస్థితుల కారణంగా తమ సీనియర్ ఆటగాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇప్పటి వరకు సీఎస్‌కే ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు మిడిలార్డర్ వైఫల్యంతోనే వరుస పరాజయాలను చవిచూసింది. టాపార్డర్ సహాయం లేకుండా లక్ష్యాన్ని చేధించలేకపోతుంది.

ఆఖరికి బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కేదార్ జాదవ్‌ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అతనికి గాయం అయిందని చెప్పి పక్కన కూర్చోపెట్టాలని సూచించాడు. సల్మాన్‌కు కేదార్ జాదవ్‌కు వీరాభిమాని కాగా.. అతను ఇలానే ఆడితే సూపర్ మ్యాన్ సల్మాన్ ఖాన్ కా ఫ్యాన్ అని తనను ఎగతాళి చేస్తారని, తన బ్రాండ్ విలువకు ముప్పని సల్మాన్ భాయ్ చింతిస్తున్నాడు.

ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీఎస్‌కే.. తదుపరి మ్యాచ్‌లకైనా.. బౌండరీ సైజ్ తగ్గిస్తే తమ ఆటగాళ్లకు మేలు జరుగుతుందని భావిస్తోంది. మైదానమంతా పరుగెత్తాల్సిన అవసరం ఉండదని, ఆ ఉక్కపోతలో తమ శక్తి సామర్థ్యాలను కాపాడుకుంటారని, అందరూ 30 ఏళ్లకు పైగానే ఉన్న ఆటగాళ్లని సీఎస్‌కే తమ విజ్ఞప్తిలో పేర్కొంది.

ఇక సీఎస్‌కే ప్రతిపాదనకు రాజస్థాన్ రాయల్స్ కూడా మద్దతు తెలిపింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్‌లు సీఎస్‌కే రిక్వెస్ట్ లెటర్‌పై సంతకం చేశారు. గౌతమ్ గంభీర్ కూడా సంజూ శాంసన్ కోసం ఈ ప్రతిపాదనకు ఒకే చెప్పాలని జైషాతో లాబియింగ్ చేస్తున్నాడు.

ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ట్విటర్ వేదికగా జరుగుతున్న ట్రోలింగ్. ఆ ట్రోలింగ్‌కు అక్షరూపమే ఇది. (జస్ట్ ఫన్ కొసమే. ఎవర్నీ కించపరిచే, తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు.)

Story first published: Saturday, October 10, 2020, 10:30 [IST]
Other articles published on Oct 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X