SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచిన తప్పిదాలు!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యం కొనసాగుతోంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ అద్భుత పోరాటంతో గెలుపు ముంగిట నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌తో లీగ్‌లో ఆరో పరాజాయన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధానంగా చేసిన మూడు తప్పిదాలు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి.

డెత్ బౌలింగ్ వైఫల్యం..
బౌలింగే ప్రధాన బలంగా చెప్పుకునే హైదరాబాద్‌కు భువనేశ్వర్ కుమార్ గాయం తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఆ జట్టు డెత్ బౌలింగ్ బలహీనమైంది. ఈ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్.. ఆఖర్లో మాత్రం చేతులెత్తేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వెనువెంటనే పెవిలియన్‌కు చేర్చిన ఆరెంజ్ ఆర్మీ ఆఖర్లో మాత్రం తడబడింది. యార్కర్స్ వేయడంలో విఫలమై భారీగా పరుగులు సమర్పించుకుంది. చివరి 5 ఓవర్లలోనే కేకేఆర్ 58 పరుగులు చేసిందంటే హైదరాబాద్ డెత్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. సన్‌రైజర్స్ బౌలర్లు కోల్‌కతాను 150 పరుగులకు కట్టడి చేసుంటే ఫలితం మరోలా ఉండేది.

డేవిడ్ వార్నర్ ఆలస్యంగా రావడం..
164 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ అనూహ్యంగా విలియమ్సన్‌ను ఓపెనర్‌గా పంపింది. బెయిర్ స్టోతో కేన్ చెలరేగడంతో మంచి శుభారంభమే దక్కింది. కానీ ఈ ఇద్దరు ఔటవ్వడంతో ఒక్కసారిగా తడబడింది. పైగా ఫామ్‌లో వార్నర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. కొంచెం ముందే వచ్చి ఉంటే హైదరాబాద్ సునాయసంగా లక్ష్యాన్ని చేధించేది. అయితే తొడ కండరాల గాయంతో విలియమ్సన్ బాధపడటంతో వార్నర్ వెనక్కు రావాల్సి వచ్చింది. ఇది కూడా దెబ్బతీసింది. మిడిలార్డర్‌లో విలియమ్సన్ ఉంటే చేజింగ్ మరింత సులువయ్యేది.

మహ్మద్ నబీని ఆడించకపోవడం..
సన్‌రైజర్స్ టాపార్డర్ బాగున్నా.. మిడిలార్డర్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మెనేజ్‌మెంట్ మహ్మద్ నబీ ఆడించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. బ్యాటింగ్,బౌలింగ్ చేయగల మొహమ్మద్ నబీ ఆడిస్తే మిడిలార్డర్ బలం అవుతుంది. బౌలింగ్‌లో బలం పెరుగుతుంది. పైగా సీపీఎల్‌తో అతను అద్భుతంగా రాణించాడు. కానీ అతనికి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం దక్కింది. అతని సేవలను ఉపయోగించుకోకపోవడం కూడా హైదరాబాద్‌ను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా మ్యాచ్ మ్యాచ్‌కు జట్టును మారుస్తుండటం కూడా ప్రతికూలం అవుతుంది. అలాగే సూపర్ ఓవర్‌లో అనుభవం లేని యువ ఆటగాడు అబ్దుల్ సమద్‌ను పంపించడం.. బెయిర్ స్టో స్ట్రైక్ తీసుకోకుండా రిస్కీ డబుల్ తీయడం హైదరాబాద్ కొంప ముంచింది. సింగిల్ తీసి బెయిర్ స్టో స్ట్రైక్‌కు వచ్చి ఉంటే సూపర్ ఓవర్‌లో హైదరాబాద్‌కు పోరాడే అవకాశం ఉండేది.

మరో సూపర్ థ్రిల్లర్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్) తో పాటు బెయిర్ స్టో(36), విలియమ్సన్(29) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా.. కమిన్స్, మావీ,వరుణ్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ ఓవర్‌లో ఫెర్గూసన్ ధాటికి హైదరాబాద్ 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది.అనంతరం కేకేఆర్ నాలుగు బంతుల్లో 3 రన్స్ చేసి గెలుపొందింది.
ఈ ఓటమిపై మాటల్లేవ్.. అందుకే విలియమ్సన్ ఓపెనింగ్ వచ్చాడు: డేవిడ్ వార్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications