కోచ్ గొంతుపై యూనిస్ ఖాన్ కత్తి పెట్టడమా..? అంతా ఉత్త మాటలే: ఇంజమామ్

కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడంటూ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలను ఆదేశ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ ఖండించాడు. యూనిస్‌తో చాలా కాలం ఆడానని తెలిపిన ఈ పాక్ మాజీ కెప్టెన్.. అతను ఎవరి పట్ల కత్తి పెట్టలేదని, అలాంటి వాడు కాదని స్పష్టం చేశాడు. ఫ్లవర్ ఆరోపణలు తనను షాక్‌కు గురిచేశాయని, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అతను అలా మాట్లాడి ఉంటాడని తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయపడ్డాడు.

అంత ఉత్త మాటలే..
‘గ్రాంట్ ఏం మాట్లాడుతున్నాడో నమ్మలేకపోతున్నా. యూనిస్‌తో నేను చాలా కాలం ఆడాను. అతను ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. యూనిస్ ఎవరిపై కత్తి పెట్టలేదు. ప్రస్తుతం గ్రాంట్ చేసిన ఆరోపణలతో ఆశ్చర్యపోయా. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అలా మాట్లాడి ఉంటాడనుకుంటున్నా. మూడేళ్ల క్రితం జరిగిందంటూ ఇప్పుడు ఆరోపణలు చేస్తే వాటికి విలువ ఉండదు. నేను చీఫ్ సెలెక్టర్ ఉన్నప్పుడైతే ఈ విషయం గురించి వినలేదు. నా దృష్టిలో ఈ ఆరోపణలకు ఎలాంటి విలువలేదు'అని చెప్పుకొచ్చాడు.

ఆర్థర్ లేకుంటే అయిపోయేవాడిని..
ఇక 2014 నుంచి 2019 వరకు పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన ఫ్లవర్.. ఇటీవల యూనిస్ ఖాన్‌పై సంచనల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘యూనిస్ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బ్రిస్బేన్‌లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. బ్రిస్బేన్ టెస్ట్ సమయంలో.. మ్యాచ్‌కు ముందు ఓరోజు ఉదయం అందరం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. యూనిస్ ఖాన్ నా పక్కనే కూర్చున్నాడు.
అప్పుడు బ్యాటింగ్‌పై ఓ చిన్న సలహా ఇచ్చా. కోపంతో ఒక్కసారిగా ఊగిపోయిన అతడు.. టేబుల్‌పై ఉన్న కత్తిని తీసుకుని నా గొంతుపై పెట్టాడు. నాకు భయమేసింది. ఆ పక్కనే ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ అడ్డుపడటంతో ఆరోజు బతికి బయటపడ్డా. సలహా ఇవ్వడం కోచింగ్‌లో భాగం. కానీ యూనిస్ అలా స్వీకరించలేదు' అని తాను పనిచేసిన క్లిష్టమైన ఆటగాళ్లలో అతనొకడని గ్రాంట్ ఫ్లవర్ చెప్పుకొచ్చాడు.

జోక్ చేస్తే రాద్దాంతమా..?
ఇక ప్లవర్ వ్యాఖ్యలపై పీసీబీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనిస్ ఖాన్ ఏదో సరదాగా కత్తి తీసుకుని గ్రాంట్ ఫ్లవర్‌ను ఆటపట్టించాడని, కానీ అదేదో సిరీయస్ ఘటన అన్నట్లు ప్లవర్ వ్యాఖ్యానించడం బాలేదని పేర్కొంది. 'పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం వాస్తవం కాదు. యూనిస్ ఖాన్ ఏదో సరదాగా కూరగాయాలు తరిగే కత్తి తీసుకుని గ్రాంట్ ఫ్లవర్‌ను ఆటపట్టించాడు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో కూడా సలహాలు ఎందుకని యూనిస్ అలా చేసి ఉండవచ్చు. అంతేకానీ కావాలని బెదిరింపులకు దిగలేదు.'అని తెలిపింది.

కోచ్‌గా ఇంగ్లండ్ టూర్‌కు
ఇక పాకిస్థాన్ క్రికెట్‌లో యూనిస్‌ది కీలకపాత్ర. టెస్ట్‌ల్లో 10099 పరుగులు చేసిన ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో 7249 రన్స్ చేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న యూనిస్.. ఇంగ్లండ్ టూర్‌లో ఉన్నాడు. ఇక యూనిస్ ఖాన్ సారథ్యంలో పాక్ 2009 టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది.
ఆ కారణంతోనే టీమిండియా హెడ్ కోచ్ పదవిని ద్రవిడ్ తిరస్కరించాడు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications