ప్రపంచ నంబర్ వన్ స్పిన్నర్ అవుట్.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పు!
భారత మహిళా క్రికెట్ జట్టు, జింబాబ్వే మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ చివరి మ్యాచ్ లో భారత జట్టు తుది ఆధిపత్యం కోసం బరిలోకి దిగింది. తుది జట్టులో పెద్ద మార్పు చేస్తూ స్టార్ స్పిన్నర్ శ్రీచరణికి విశ్రాంతి కల్పించి ఆమె స్థానంలో ప్రేమా రావత్‌ను ప్లేయింగ్-11లోకి తీసుకున్నారు.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లను గెలుచుకుని 2-0తో తిరుగులేని ఆధిపత్యంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడా, రెండో మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన భారత్ ఇప్పుడు మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. "ఈ రోజు మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే మా మిడిలార్డర్ బ్యాటర్లకు క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. నిర్దిష్టమైన స్కోరు లక్ష్యంగా పెట్టుకోనప్పటికీ 180 ప్లస్ పరుగులు చేయాలని భావిస్తున్నాం. శ్రీ చరణికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చాం, ఆమె స్థానంలో ప్రేమా రావత్ జట్టులోకి వచ్చింది. షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లు ఉన్నప్పుడు భారీ షాట్లు సహజంగానే వస్తాయి" అని పేర్కొంది.
మరోవైపు జింబాబ్వే కెప్టెన్ జోసెఫిన్ నకోమో మాట్లాడుతూ.. తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలని భావించినట్లు తెలిపింది. పవర్‌ప్లేలో మెరుగ్గా రాణించి, మైదానంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ సానుకూల దృక్పథంతో ఆడటానికి ప్రయత్నిస్తామని చెప్పింది.
భారత ప్లేయింగ్-11:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన(కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నిక్కి ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమా రావత్.
జింబాబ్వే ప్లేయింగ్-11:
కెలిస్ నధ్లోవు, బిలవ్‌డ్ బిజా, చిపో ముగేరి-తిరిపానో, షార్నే మేయర్స్, జోసెఫిన్ నకోమో (కెప్టెన్), నియాషా గ్వాన్జురా, మోడెస్టర్ ముపాచిక్వా (వికెట్ కీపర్), కుద్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, తెండాయ్ మకుషా, నోమ్‌వెలో సిబాండా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


