Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్ వశం !

జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. వడోదర వేదికగా రెండో వన్డేలో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మల రికార్డు సెంచరీలు
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించి జింబాబ్వే ముందు 329 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (126) బాధ్యతాయుతమైన సెంచరీతో మెరవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(106 నాటౌట్) మెరుపు సెంచరీతో అదరగొట్టింది. వీరిద్దరి వీరవిహారంతో భారత జట్టు భారీ స్కోరు సాధించగలిగింది.

INDW vs ZIMW 2nd ODI India Beats Zimbabwe by 121 Runs Seals Series 2-0 centuries from Harmanpreet Deepti Sharma

అయితే భారత ఇన్నింగ్స్‌కు ఆరంభంలోనే కాస్త తడబాటు ఎదురైంది. కెప్టెన్ స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆ తర్వాత ప్రతీకా రావల్ 67 బంతుల్లో 61 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మిడిలార్డర్లో దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్, 15 ఫోర్ల సహాయంతో 121 బంతుల్లో 126 పరుగులు చేసింది. ఆమెకు లోయరార్డర్లో దీప్తి శర్మ చక్కటి సహకారం అందించింది. ఆమె 86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్ స్కోరును 300 దాటించింది.

మళ్లీ దుమ్మురేపిండు.. తెలుగోడి దెబ్బకు పాక్ స్టార్ క్రికెటర్ ఫిదా!

Also Read

మళ్లీ దుమ్మురేపిండు.. తెలుగోడి దెబ్బకు పాక్ స్టార్ క్రికెటర్ ఫిదా!

జింబాబ్వే 207 పరుగులకే ఆలౌట్
329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే మహిళల జట్టు భారత బౌలింగ్ ముందు నిలబడలేక 48.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే తరఫున, వికెట్ కీపర్ మోడెస్టర్ ముపాచిక్వా అత్యధికంగా 49 పరుగులు (70 బంతుల్లో, 9 ఫోర్లు) చేయగా.. చిపో ముగేరి-తిరిపానో 57 బంతుల్లో 46 పరుగులు చేసింది. వీరే కాకుండా, బిలెవెడ్ బిజా 34, కెప్టెన్ జోసెఫిన్ న్కోమో 20 పరుగులు చేసినప్పటికీ, బ్యాటర్లలో ఎవరూ తమకు లభించిన ఆరంభాలను పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోయారు.

వైష్ణవి శర్మకు 4 వికెట్లు
భారత బౌలింగ్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వైష్ణవి శర్మ విధ్వంసం సృష్టించి మోడెస్టర్ ముపాచిక్వా, బిలావ్డ్ బిజా, జోసెఫిన్ న్కోమో, మిషెల్ మావుంగాలను ఔట్ చేస్తూ నాలుగు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో సెంచరీ కూడా సాధించిన దీప్తి శర్మ తన అద్భుతమైన బౌలింగ్‌తో ముగ్గురు లోయర్-ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు సయాలీ సత్ఘరే, శ్రీచరణి, జింటిమణి కలిత తలో వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన భారత జట్టు 2-0తో సిరీస్ కైవసం చేసుకుని, ఆఖరి వన్డేలో కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.

Story first published: Sunday, October 25, 2026, 21:53 [IST]
Other articles published on Oct 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+