48 ఏళ్ల చరిత్రకు తెర.. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ!
జింబాబ్వే మహిళల జట్టుతో వడోదరలోని బీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి స్టేడియం నలువైపులా ఫోర్ల వర్షం కురిపిస్తూ మెరుపు సెంచరీ బాదింది. 86 బంతుల్లో 15 ఫోర్లతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన దీప్తి శర్మ.. భారత మహిళల క్రికెట్ 48 ఏళ్ల వన్డే చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఆరో స్థానంలో తొలి భారతీయ సెంచరీ
భారత మహిళల క్రికెట్ జట్టు 1978లో కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గత 48 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా దీప్తి శర్మ చరిత్రకెక్కింది. గతంలో 2025లో దక్షిణాఫ్రికాపై రిచా ఘోష్ సాధించిన 94 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును తిరగరాస్తూ దీప్తి శర్మ ఈ ఘనతను తన పేరిట లిఖించుకుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యం
కెప్టెన్ స్మృతి మంధాన(0), షఫాలీ వర్మ(8) త్వరగానే ఔటైనా.. ప్రతీకా రావల్(61) హాఫ్ సెంచరీతో ఆదుకుంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్(121 బంతుల్లో 126 పరుగులు)తో కలిసి దీప్తి శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల వన్డేల్లో భారత్ తరఫున ఐదో వికెట్‌కు ఏకంగా 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల వన్డేల్లో భారత్ తరఫున ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో 2022 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై స్నేహ్ రాణా-పూజా వస్త్రాకర్‌ల జోడీ నెలకొల్పిన 122 పరుగుల రికార్డును వీరు అధిగమించారు.
ఐదో వేగవంతమైన వన్డే సెంచరీ
కేవలం 83 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న దీప్తి శర్మ.. భారత మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా వన్డే సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియాపై 50 బంతుల్లోనే సెంచరీ బాదిన స్మృతి మంధాన అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఇద్దరి సెంచరీల ధాటికి భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి జింబాబ్వే ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


