
ముగించేస్తున్నా అన్నాడు..
‘2014లో మహీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను ఆడిన ఆఖరి మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ను కాపాడేందుకు ఆ రోజు మేం ఎంతో కష్టపడ్డాం. కానీ ఫలితం దక్కలేదు. అప్పుడు ధోనీ స్టంప్ తీసుకొని ఇక నేను టెస్ట్ క్రికెట్‌ను ముగించేస్తున్నా అని సాధారణంగా చెప్పాడు. అదో భావోద్వేగ సన్నివేశం. నేనూ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ సాయంత్రం మహీ గదిలోనే కూర్చున్నాం. ఆ రాత్రంతా అతడు టీమిండియా జెర్సీలోనే ఉన్నాడు. కన్నీరు కార్చాడు' అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

ధోనీతో ఎంతో నేర్చుకున్నా..
కెరీర్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన అశ్విన్.. ధోనీతో సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలోనే మహీతో తనకు ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ‘భారత్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా చెపాక్‌లో నెట్‌బౌలర్‌గా తొలి సారి ధోనీని కలిసాను. అనంతరం 2008లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో చేరాను. ప్రారంభంలో అతన్ని కలిసినప్పుడు పొడువాటి జుంపాల జుట్టుతో ఉండేవాడు. అతడితో చాలా సమయం గడిపి ఎంతో నేర్చుకున్నాను. ధోనీ ఎంతో పరిపక్వత ఉన్న సారథో తెలుసుకున్నాను.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
విలువైన సలహా ఇచ్చాడు..
2010 ఛాంపియన్స్ లీగ్‌లో మహీ తనకో విలువైన సలహా ఇచ్చాడని ఈ ఆఫ్ స్పిన్నర్ గుర్తు చేసుకున్నాడు. 'విక్టోరియా బస్‌రేంజర్స్‌తో మ్యాచులో నేను సూపర్ ఓవర్ వేశాను. అప్పుడు ఎంఎస్ నా దగ్గరికొచ్చి ఒత్తిడిలో నేను అత్యుత్తమంగా బంతులు వేయలేదని చెప్పాడు. క్యారమ్ బంతిని ఎక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చాడు.' అని యాష్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. అలాగే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో తాను వికెట్లు తీయకున్నా ఎంతో ప్రోత్సహించాడని తెలిపాడు. ఓ పక్క జడేజాకు వికెట్లు పడుతున్నా.. నీ బౌలింగ్ విధానం, ఆలోచనా విధానం బాగుందని ఇలాగే కొనసాగాలని అండగా నిలిచాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications

ఐపీఎల్ తర్వాత ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్.. బీసీసీఐ ప్లాన్!