Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వామ్మో కరోనా.. మేము ‘ఆల్ ఇంగ్లండ్’ ఆడం..

Indian Shuttlers Withdraw From All England Badminton Championships Due To Coronavirus Effect

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా(కోవిడ్‌-19) వైరస్‌ కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు రద్దవుతుండగా, మరికొన్ని వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ భయంతో ఇండియాకు చెందిన పలువురు బ్యాడ్మింటన్ ప్లేయర్లు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉంటున్నారు.
ఈ మేరకు టోర్నీ నుంచి తమ ఎంట్రీని విత్ డ్రా చేసుకుంటున్నామని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)కు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు.

ధ్రువీకరించిన బాయ్...

ధ్రువీకరించిన బాయ్...

విత్‌డ్రా చేసుకున్న వారిలో డబుల్స్ స్టార్స్ చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌‌తో పాటు సీనియర్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, మను అత్రి, సుమీత్‌ రెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని బాయ్ సెక్రటరీ అజయ్ సింఘానియా ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని టోర్నీ నిర్వాహకులు గతవారం వెల్లడించడంతో.. స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ ఈ పోటీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రిస్క్ ఎందుకు..

రిస్క్ ఎందుకు..

హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ అక్కడికి వెళ్లి రిస్క్‌ తీసుకోలేమని చెప్పాడు. ఇక గచ్చిబౌలిలోనూ కరోనా ప్రభావం ఉందనే కారణంతో గోపీచంద్‌ అకాడమీని వీడి.. సొంత ఊరుకు పయనమవుతున్నట్లు తెలిపాడు.

'మేమంతా చర్చించుకునే.. ఈ సమయంలో ఆల్‌ ఇంగ్లండ్‌ పోటీలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. వైరస్‌ విజృంభణ వల్ల ఆ టోర్నీ రద్దు అవుతుందని భావించాం. కానీ, నిర్వాహకులు యథావిధిగా జరుపుతామని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని గోపీ సర్‌కు చెప్పాను. ప్రస్తుతం గచ్చిబౌలిలోనూ వైరస్‌ కేసులు ఉండటంతో.. అకాడమీలో ఉండడం కూడా అంత సురక్షితం కాదు. మాలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని భావించాం' అని ప్రణయ్‌ పేర్కొన్నాడు.

ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

ఇంగ్లండ్‌లో 87 మంది కరోనా బాధితులు..

ఇంగ్లండ్‌లో 87 మంది కరోనా బాధితులు..

అలాగే చిరాగ్‌ మాట్లాడుతూ కొంత సమయం వేచిచూస్తానన్నాడు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,300 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లో ఈ వైరస్‌ కేసులు గణణీయంగా పెరుగుతున్నాయి.ఇక మార్చి 11 నుంచి ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఇంగ్లాండ్‌లో కరోనా బాధితుల సంఖ్య 87కి చేరింది. ఇదే ఇప్పుడు ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను కలవరపెడుతోంది.

Story first published: Friday, March 6, 2020, 11:22 [IST]
Other articles published on Mar 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+