నాడా కిందకు భారత క్రికెటర్లు: ఇకపై ఏం జరుగుతుందో మరి!

హైదరాబాద్: "భారత క్రికెటర్లు అందరూ ఇకపై నాడా (నేషనల్ యాంటి డోపింగ్ ఏజన్సీ) డోపింగ్ టెస్టుల్లో పాల్గొనాల్సింటారు" అని క్రీడాశాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ జులానియా తెలిపారు. ఆటగాళ్లందరూ సమానమేనని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆర్‌ఎస్ జులానియా పేర్కొన్నారు.
భారత క్రికెటర్లను నాడా కిందకు తీసుకొచ్చే అంశంపై క్రీడాశాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ జులానియా, నాడా డీజీ నవీన్ అగర్వాల్‌లు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, బోర్డు జీఎమ్(క్రికెట్ ఆపరేషన్స్) సాబా కరీమ్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా నాడా యాంటీ డోపింగ్ పాలసీ విధానానికి కట్టుబడి ఉంటామని బోర్డు లిఖితపూర్వకంగా ఇచ్చింది.
ఈ నిర్ణయంతో టీమిండియా ఆటగాళ్లు సైతం నాడా పరిధిలోకి రానున్నారు. నిజానికి జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎప్పటి నుంచో భారత ఆటగాళ్లను నాడా కిందకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, నాడా పనితీరుపై బీసీసీఐకి అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో బోర్డే తన ఆటగాళ్లకు ఇన్నాళ్లూ డోప్ టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది.

వాడా నిషేధిత జాబితాలో
అయితే, ఇటీవల ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్ పృథ్వీ షా 8 నెలల నిషేదానికి గురయ్యాడు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని పృథ్వీ షా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు.
20 ఏళ్ల తర్వాత కూడా కోహ్లీ-రోహిత్ విబేధాలపై స్టోరీలు ఆగవు

పరస్పర విరుద్ధ ప్రయోజనం
దీంతో డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడాశాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది. అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్ టెస్ట్‌లు నిర్వహించాలని బోర్డుకు సూచించింది. బీసీసీఐ మాత్రం తాము డోపింగ్ టెస్టులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నాయని పేర్కొంది.

జులానియా మాట్లాడుతూ
అయితే బీసీసీఐ వాదనతో కేంద్ర క్రీడాశాఖ ఏకీభవించలేదు. ఈ నేపథ్యంలో జులానియా మాట్లాడుతూ "డోప్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పాథాలజిస్టుల సామర్థ్యం, నమూనా సేకరణ వంటి మూడు సమస్యలను బిసీసీఐ మన ముందు లేవనెత్తింది. వారు కోరుకున్న సౌకర్యాలు ఏమైనా ఇస్తామని వారికి హామీ ఇచ్చాం. అయితే ఇందుకోసం కొంత ఛార్జీ వసూలు చేస్తాం. అన్ని జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్‌ల్లో ఈ సౌకర్యాలు సమానంగా ఉంటాయి. బిసీసీఐ ఇందుకు భిన్నం కాదు. అయితే, వారు పాటించాలి" అని అన్నారు.
గ్రేట్ ప్లేయర్ ట్యాగ్‌కు విరాట్ కోహ్లీ అన్ని విధాలా ఆర్హుడు

ఖర్చుని భరించేందుకు మేము సిద్ధం
చట్టాన్ని పాటించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని రాహుల్ జోహ్రీ తెలిపాడు. "మేము లేవనెత్తిన కొన్ని సమస్యలను కేంద్ర క్రీడాశాఖ వారు పరిష్కరిస్తామని చెప్పారు. హై క్వాలిటీ టెస్టింగ్‌కు సంబంధించిన ఖర్చుని భరించేందుకు మేము అంగీకరించాము" అని రాహుల్ జోహ్రీ తెలిపాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు నాడా డోపింగ్ పరీక్షల్లో పాల్గొనాల్సిందే. నాడా పనితీరుపై అనుమానాలు ఉన్నాయని బీసీసీఐ యాంటి డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వి అనడం కొసమెరుపు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications