For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#WTCFinal2021: హమ్మయ్యా ఆ అంపైర్ లేడు.. ఇట్స్ రివేంజ్ టైమ్.. పంత్ ఇరగదీస్తాడు.. యాష్ ట్యాగ్ ట్రెండింగ్!

Indian Cricket Fans Trends: WTC Final 2021 In Twitter Talks About Rishab Pant And Umpire Richard Kettleborough
WTC Final 2021 Trends In Twitter | Richard Kettleborough | Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటం, ఇంటర్నేషనల్ సిరీస్‌లు లేకపోవడంతో ఐసీసీ ఈవెంట్ అయిన వరల్డ్‌టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై అందరి దృష్టి నెలకొంది. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఇక టెస్ట్ ఫార్మాట్‌లో తొలి ఐసీసీ ఈవెంట్ కావడంతో ఈ టైటిల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సౌతాంప్టన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బబుల్‌లో ఔట్‌డోర్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మరోవైపు కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతూ సమాయత్తం అవుతోంది.

#WTCFinal2021 ట్రెండింగ్..

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ మెగా ఫైనల్‌ గురించే చర్చ జరుగుతుంది. ఏ జట్టు గెలుస్తుందనే అంచనాలతో పాటు తుది జట్టు ఎలా ఉంటుందనేదానిపై ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టీస్ లేమీ టీమిండియా దెబ్బతిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. అలా ఏం జరగదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్, రన్ మెషిన్ కింగ్ కోహ్లీ దుమ్ములేపుతారని వారి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై కనబర్చిన ప్రదర్శన పునరావృత్తం చేస్తే కోహ్లీసేనదే టైటిల్ అని కామెంట్ చేస్తున్నారు. దాంతో ట్విటర్ #WTCFinal2021 ట్యాగ్ దుమ్మురేపుతోంది.

హమ్మయ్యా ఆ అంపైర్ లేడు..

ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌కు సంబంధించిన మ్యాచ్ అఫిషియల్స్‌ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఐసీసీ ఎలైట్ ప్యానె‌ల్‌లోని రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్‌లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా.. రిచర్డ్ కెటిల్ బరోను టీవీ అంపైర్‌గా.. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్‌కు చెందిన అలెక్స్ వార్ఫ్ నాలుగో అంపైర్‌గా సేవలందించనున్నారు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఆ దేశ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. అయితే రిచర్డ్ కెటిల్ బరోను టీవీ అంపైర్‌గా ప్రకటించడంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెటిల్ బరో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిందని, కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో థర్డ్ అంపైర్‌గా సేవలందిస్తున్నాడు కాబట్టి భారత్ గెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

WTC Final అఫిషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో ఆ ఐరెన్ లెగ్ అంపైర్.. కానీ!

ఇట్స్ రివేంజ్ టైమ్..

ఇక 2019 వన్డే ప్రంచకప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని మరికొంత మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నాటి సెమీఫైనల్ మ్యాచ్‌లో టాప్-3 బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(1),విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారని, ఈ సారి వీరు చెలరేగాలని సూచిస్తున్నారు. నాటి మ్యాచ్ స్కోర్ కార్డును షేర్ చేస్తూ మరీ రెచ్చగొడుతున్నారు. మరో 10 రోజుల్లో ఈ మెగా ఫైనల్‌కు తెరలేవనుందని, ఈ మ్యాచ్‌ కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ డబుల్..

ఇక ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేస్తాడని అతని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా చెలరేగుతాడని, సెంచరీ ఆకలి తీర్చుకుంటూ పులిలా గర్జిస్తాడని అతని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో డబ్ల్యూటీసీ ఫైనల్ ముచ్చట్లతో హల్‌చల్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌కు సంబంధించిన మీమ్స్, ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

Story first published: Wednesday, June 9, 2021, 16:23 [IST]
Other articles published on Jun 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+