Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: సచిన్ ముద్దుగా చెప్పిండు.. ఒక్కడు వినలే! ఇప్పుడు ఏమైంది!

Indian Bowlers Ignores Sachin Tendulkars bowling advice against Steve Smith

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ఆటతీరుతో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ధాటికి వరుస పరాజయాలతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో చేజార్చుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో శతకాలతో చెలరేగిన స్మిత్.. భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు. మ్యాచ్‌కు ముందే తాను లయ అందుకున్నానని హెచ్చరించిన ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ అన్నట్లుగానే భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్ వన్డేలో 105, రెండో వన్డేలో 104 పరుగులతో తానెంతటి ప్రమాదకరమో తెలియజేశాడు.

రెండో వన్డేల్లో అయితే తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కేవలం 18 ఓవర్లలోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌ 38వ ఓవర్‌లోనే మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. స్మిత్‌ దూకుడు ఇలాగే కొనసాగితే తదుపరి సిరీస్‌ల్లో కోహ్లీసేనకు కష్టాలు తప్పవు. అయితే ఈ వన్డే సిరీస్‌కు ముందే స్మిత్‌ను ఔట్ చేయడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ చిట్కా చెప్పాడు. కానీ భారత బౌలర్లు మాస్టర్ సలహాను లెక్క చేయకుండా బౌలింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నారు.

ఫిఫ్త్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ..

ఫిఫ్త్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ..

ఫిఫ్త్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ బంతులు వేసి స్మిత్‌ను అడ్డుకోవాలని భారత పేసర్లకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ‘స్మిత్ టెక్నిక్ అసాధారణంగా ఉంటుంది. సాధారణంగా అయితే టెస్ట్ మ్యాచ్‌ల్లో అరౌండ్ ఆఫ్ స్టంప్ లేదా ఫోర్త్ స్టంప్ లైన్‌పై బంతులు వేయాలని బౌలర్లకు చెబుతుంటాం. కానీ స్మిత్ క్రీజులో అటు ఇటు కదులుతూ ఉంటాడు. కాబట్టి ఆ లైన్‌ను మరో నాలుగైదు అంగుళాల దూరం జరపాల్సి ఉంటుంది. దాని కోసం బౌలర్లు ఫోర్త్-ఫిప్త్ స్టంప్ మధ్య ఓ లైన్‌ను ఊహించుకొని దాన్నే టార్గెట్ చేయాలి. బౌలర్లు తమ మనసులో ఆ లైన్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

 ఆఫ్ స్టంప్ ఏరియాలో..

ఆఫ్ స్టంప్ ఏరియాలో..

ఈ సిరీస్‌లో భారత బౌలర్లు తపపై దూకుడుగా ఉంటారని స్మిత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అలాగే, షార్ట్ పిచ్ బాల్స్ సవాల్‌కు రెడీ ఉన్నానని తను చెప్పినట్లు చదివా. నేనైతే ఆఫ్ స్టంప్ ఏరియాలో అతడిని పరీక్ష పెట్టాలని అంటున్నా. అతడిని బ్యాక్‌ఫుట్‌పైనే ఆడేలా.. స్టార్టింగ్‌లోనే మిస్టేక్ చేసేలా బౌలింగ్ చేయాలి. తరచూ లెగ్ స్టంప్ నుంచి ఆఫ్ స్టంప్‌కు వచ్చే స్మిత్ కోసం ఇన్‌స్వింగింగ్ యార్కర్ కూడా ఎఫెక్టివ్‌గానే ఉంటుంది. కానీ, అది ఫలితం ఇవ్వాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా బంతి ఏ మేరకు స్వింగ్ అవుతుందో చూడాలి. పైగా ఈసారి సలైవా వాడలేం.'అని సచిన్ పలు సూచనలు చేశాడు.

ఒక్కడు వినలేదు..

ఒక్కడు వినలేదు..

అయితే సచిన్ చెప్పిన ఈ చిట్కాలను ఏ ఒక్క బౌలర్ చెవికెక్కించుకోలేదు. స్మిత్‌పై ఎలాంటి వ్యూహం లేకుండా బౌలింగ్ చేసి దారుణంగా విఫలమయ్యారు. అతని బలహీనతలపై టార్గెట్ చేయకుండా గుడ్ లెంగ్త్, లిటిల్ ఫుల్లర్ బంతులు వేస్తూ ధారళంగా పరుగులిచ్చుకున్నారు. వాస్తవానికి షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేకపోవడం ‌స్మిత్ బలహీనత. గత ఏడాది ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులతో స్మిత్‌ను బోల్తా కొట్టించారు. కానీ రెండు వన్డేల్లోనూ ఆ బంతుల్ని సంధించడంలో భారత ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు. అంతేకాకుండా ఆఫ్‌ స్టంప్ ఏరియాలో పరీక్ష పెట్టాలన్న సచిన్ మాటను లెక్క చేయలేదు. రెండో వన్డేలో స్మిత్‌కు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. సచిన్ చెప్పినట్లే బౌలింగ్ చేసి వికెట్ సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా కట్టర్స్ వేస్తూ అతను ఇబ్బంది పడేలా చేశాడు. కనీసం తదుపరి సిరీస్‌లోనైనా సచిన్ సలహాలను భారత బౌలర్లు పాటించాలని అభిమానులు కోరుతున్నారు.

సారీ ఆస్ట్రేలియా.. మ్యాచ్‌కు ముందు చేసుకోవడం వల్లే గాయమైంది.. వార్నర్ సతీమణి బోల్డ్ కామెంట్స్!

Story first published: Tuesday, December 1, 2020, 15:40 [IST]
Other articles published on Dec 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+