For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సారీ ఆస్ట్రేలియా.. మ్యాచ్‌కు ముందు చేసుకోవడం వల్లే గాయమైంది.. వార్నర్ సతీమణి బోల్డ్ కామెంట్స్!

Candice Warner says a marathon session was to blame for her husband Davids groin injury

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గజ్జ గాయంతో భారత్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్నర్ గాయపడ్డాడు. గాయం తీవ్రత దృష్ట్యా అతను మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే వార్నర్ స్ట్రెయిన్ ఇంజ్యూరీపై అతని సతీమణి క్యాండిస్ వార్నర్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఎక్స్ రేటేడ్ జోక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్‌కు ముందు మారథాన్ సెక్స్ చేసుకోవడంతోనే అతనికి గాయమైందని ఓ రేడియో షోలో సరదాగా చెప్పుకొచ్చింది.

నాలుగు నెలల గ్యాప్ తర్వాత..

నాలుగు నెలల గ్యాప్ తర్వాత..

ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2020 సీజన్‌లో పాల్గొనడంతో తాము నాలుగు నెలలు దూరంగా ఉండాల్సి వచ్చిందని క్యాండిస్ వార్నర్ తెలిపింది. భారత్‌తో జరిగిన రెండో వన్డేకు రెండు రోజుల ముందే డేవిడ్‌ను కలిసానని పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు తాము మారథాన్ సెక్స్ చేసుకున్నామని, దాంతోనే వార్నర్‌కు గాయమై ఉండొచ్చని నవ్వుతూ ‘ట్రిపుల్ ఎమ్స్ మూన్ మ్యాన్ ఇన్ ద మార్నింగ్'రేడియో షోలో చెప్పుకొచ్చింది. ‘నాలుగు నెలల తర్వాత మ్యాచ్‌కు రెండు రోజుల ముందే కలుసుకున్నాం. ప్రతీ ఒక్కరు చేసుకునేది చేశాం.'అని మారథన్ సెక్స్ గురించి చెప్పకనే చెప్పింది. ఈ వ్యాఖ్యలకు రెడియో హోస్ట్ స్పందిస్తూ.. ‘నీ వల్లే వార్నర్‌కు గజ్జలో గాయమైంది. నువ్వు క్రికెట్ ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం చేశావ్'అన్నాడు. దానికి క్యాండిస్ సారీ ఆస్ట్రేలియా అంటూ బదులిచ్చింది.

ఫస్ట్ టెస్ట్ ఆడుతాడు..

ఫస్ట్ టెస్ట్ ఆడుతాడు..

ఇక జోక్స్‌ను పక్కన బెడితే.. ఫస్ట్ టెస్ట్ లోపు వార్నర్ రికవరీ అవుతాడని ఆసీస్ అభిమానులకు క్యాండిస్ హామీ ఇచ్చింది. ‘వార్నర్ గ్రోయిన్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్యులు పర్యవేక్షణలోనే ఉన్నాడు. భారత్‌తో ఫస్ట్ టెస్ట్‌కు ఇంకా 17 రోజుల సమయం ఉంది. ఆలోపు ఖచ్చితంగా రికవరీ అవుతాడు. వార్నర్ కూడా ఫస్ట్ టెస్ట్ ఆడాలనే కసితోనే ఉన్నాడు.'అని క్యాండిస్ చెప్పుకొచ్చింది.

లైంగిక జీవితంపై..

లైంగిక జీవితంపై..

ఇక తమ లైంగిక జీవితానికి సంబంధించిన విషయాలను కూడా క్యాండిస్ గతంలో ఓ రేడియో షోలో చెప్పుకొచ్చింది. ‘ది కైల్ అండ్ జాకీ ఓ' షో‌లో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ‘ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అతను కావాలనుకుంటే చేస్తాడని, లేకుంటే లేదని తెలిపింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే నిబంధనతో అయితే ఏమి ఉండడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త ఈ విషయంలో చాలా సమర్థుడని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.

జాన్‌ మాథ్యూ‌కు చాన్స్..

జాన్‌ మాథ్యూ‌కు చాన్స్..

వార్నర్‌ స్థానాన్ని జాన్‌ మాథ్యూ షార్ట్‌ భర్తీ చేస్తాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపిన విషయం తెలిసిందే. అతని స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు.వార్నర్‌, కమిన్స్‌ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్‌లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు. డిసెంబర్‌ 17 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.

LPL 2020: తమ్ముడూ.. అంత కోపం పనికిరాదు.. నాకెరీర్ అంత లేదు నీ వయసు! (వీడియో)

Story first published: Tuesday, December 1, 2020, 14:23 [IST]
Other articles published on Dec 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+