Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు!

India vs Australia: 32 Years since no Australian batsman scored a fifty in a Test match at home

మెల్‌బోర్న్: టీమిండియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చెత్త గణంకాలు నమోదు చేశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఆసీస్ సొంతగడ్డపై మరోసారి ఈ చెత్త రికార్డును పునరావృతం చేసింది.

చివరి సారిగా వెస్టిండీస్‌తో స్వదేశంలోనే జరిగిన టెస్ట్‌లో ఇలాంటి ప్రదర్శన చేయగా.. దాదాపు 177 టెస్ట్‌ల తర్వాత మళ్లీ అదే ప్రదర్శన పునరావృతమైంది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా ఇలా మ్యాచ్ ముగించడం ఐదు సార్లు కాగా.. సొంతగడ్డపై మాత్రం మూడు సార్లు. చివరి సారిగా వెస్టిండీస్‌తో మెల్‌బోర్న్ మైదానంలోనే ఈ చెత్తరికార్డు మూటగట్టుకోవడం విశేషం.

ఇక రెండేళ్ల కిత్రం అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌లో కూడా ఆసీస్ ఆటగాళ్లకు 50కి పైగా పరుగులు చేయకుండానే మ్యాచ్ ముగించారు. 2016లో శ్రీలంకపై, 1997లో ఇంగ్లండ్‌పై కూడా ఇదే తరహా ప్రదర్శన కనబర్చారు. భారత బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితైన కంగారులు.. రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటయ్యారు.

ఇక భారత జట్టులో కెప్టెన్ అజింక్యా రహానే సూపర్ సెంచరీతో రాణించడంతో సునాయస విజయాన్నందుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ 326 పరుగులు చేసిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 70 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది.

Story first published: Tuesday, December 29, 2020, 13:51 [IST]
Other articles published on Dec 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+