Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్మీలో విధులు.. అమితాబ్ పాటతో తోటి సైనికులను అలరించిన ధోనీ

MS Dhoni Entertains Territorial Army Battalion-Soldiers With Big B Song || Oneindia Telugu
Kashmir duty: Lieutenant Colonel MS Dhoni entertains Territorial Army battalion soldiers with Big B song

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో సైనిక విధుల్లో బిజీబిజీగా ఉన్నాడు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్నాడు. భారత ఆర్మీలో పనిచేయాలనే కోరికతో క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చి గత శుక్రవారం దక్షిణ కశ్మీర్‌లోని పారా రెజిమెంట్‌ విభాగంలో విధులు ప్రారంభించాడు. మహీ ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొననున్నాడు.

అమితాబ్ పాటతో:

ధోనీ ఒకవైపు కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులను అలరిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌ 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్ నటించిన 'కభీ కభీ' సినిమాలోని 'మై పల్‌ దో పల్‌కా షాయర్‌ హు' నే పాటను పాడి తోటి సైనికులను అలరించాడు. పాట అనంతరం సైనికులు అందరూ ధోనీని ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ధోనీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

షూస్‌ను పాలిష్ చేస్తున్న ధోనీ:

అంతేకాదు విధి నిర్వహణలో ఉన్న ధోనీ తన షూస్‌ను తానే పాలిషింగ్ చేసుకుంటున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ షూస్ పాలిష్ చేసుకుంటుండడాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ధోనీ సింప్లిసిటీకి అది నిదర్శనమని కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ ఫొటోను ధోనీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఆర్మీ సిబ్బందితో వాలీబాల్‌:

అంతకుముందు విరామ సమయంలో అక్కడి ఆర్మీ సిబ్బందితో ధోనీ వాలీబాల్‌ ఆడాడు. దీనికి సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ధోనీ ప్రస్తుతం తన యూనిట్‌తో కలిసి గార్డు, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ధోనీ ఆర్మీలో పనిచేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

విండీస్ పర్యటనకు దూరం

విండీస్ పర్యటనకు దూరం

ప్రపంచకప్‌లో నెమ్మదైన ఆటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ధోనీ క్రికెట్‌ నుంచి రిటైరవుతాడని వార్తలు వచ్చాయి. ఇవేమి పట్టించుకోకుండా ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇక వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని ధోనీ నిర్ణయించుకున్నాడని సమాచారం. విండీస్ పర్యటన నుండి ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. టీ20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే మూడో టీ20లో మాత్రం (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6) దుమ్ములేపాడు.

పంత్‌ను టీమిండియా భవిష్యత్తుగా చూస్తున్నాం.. భువిలాగే దీపక్‌ బౌలింగ్ చేస్తున్నాడు

Story first published: Wednesday, August 7, 2019, 15:14 [IST]
Other articles published on Aug 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+