Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: అరంగేట్రంలోనే చెత్త రికార్డ్!

IND vs WI: వెస్టిండీస్ జట్టుతో గౌహతి వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత యువ బౌలర్ ఆకిబ్ నబీ అరంగేట్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోగా.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లైనప్‌లో చోటు దక్కించుకున్న ఆకిబ్ నబీకి తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై విండీస్ ఓపెనర్లు విజృంభించడంతో ఆకిబ్ నబీ బౌలింగ్‌ను పూర్తిగా టార్గెట్ చేశారు.

IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 53 ఏళ్లలో ఇదే తొలిసారి!

IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 53 ఏళ్లలో ఇదే తొలిసారి!

అరంగేట్రంలోనే నిరాశపరిచిన స్పెల్
మ్యాచ్ ఆరంభంలో బంతిని కాస్త స్వింగ్ చేస్తూ మంచి ఆరంభాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆకిబన్ నబీ విండీస్ బ్యాటర్ల దాడికి గురయ్యాడు. తన స్పెల్‌లో ఏమాత్రం వికెట్లు తీయలేకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా 8.5 ఓవర్లు బౌలింగ్ చేసిన నబీ ఒక్క వికెట్ కూడా సాధించకుండా ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు.

India vs West Indies Auqib Nabi Registers Worst Bowling Figures on India ODI Debut Full Details Here

51 ఏళ్ల నాటి చెత్త రికార్డు బ్రేక్
ఈ మ్యాచ్‌తో భారత వన్డే చరిత్రలోనే అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు సమర్ఫించుకున్న బౌలర్‌గా ఆకిబ్ నబీ నిలిచాడు. దీని ద్వారా 1975 నాటి కర్సన్ ఘావ్రి రికార్డును అతడు తుడిచిపెట్టేశాడు. 1975లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డేలో ఘావ్రి 11 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చారు. ఇప్పుడు ఆకిబ్ నబీ 8.5 ఓవర్లలోనే 84 పరుగులు ఇచ్చి ఈ చెత్త పేరును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచ చరిత్రలోనే అరంగేట్రంలో అత్యధిక పరుగులు ఇచ్చిన జాబితాలో ఆకిబ్ నబీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ దేశానికి చెందిన పీటర్ కార్నెల్ 2008లో న్యూజిలాండ్ జట్టుపై 95 పరుగులు ఇచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు.

IND vs WI: కొంపముంచిన కోహ్లీ.. వెస్టిండీస్ బ్యాటర్ల ఊచకోత! ఆల్‌టైమ్ రికార్డ్!

Also Read

IND vs WI: కొంపముంచిన కోహ్లీ.. వెస్టిండీస్ బ్యాటర్ల ఊచకోత! ఆల్‌టైమ్ రికార్డ్!

భారత్ తరఫున అత్యంత ఖరీదైన ఎకానమి రేటు
అత్యధిక పరుగులు ఇవ్వడమే కాకుండా మరో అవాంఛనీయ రికార్డును కూడా ఆకిబ్ నబీ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో దాదాపు 30 బంతులు వేసిన ఏ భారత బౌలర్‌కైనా 9.51 ఎకానమీ రేటు అనేది అత్యంత చెత్త గణాంకంగా నమోదైంది. ఈ ఏడాది ఆరంభంలో ధర్మశాలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తన అరంగేట్రంలో హర్ష్ దుబే(9.4 ఎకానమీ) నెలకొల్పిన రికార్డును ఆకిబ్ నబీ అధిగమించాడు.

చేజారిన వికెట్ అవకాశం
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఆకిబ్ నబీకి ఓ వికెట్ లభించే సువర్ణావకాశం వచ్చింది. ఆ ఓవర్ మొదటి 5 బంతుల్లో కేవలం రెండు బంతులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆకిబ్ నబీ.. చివరి బంతికి షమార్ జోసెఫ్ ను గాల్లోకి షాట్ కొట్టేలా చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ ఆ క్యాచ్ ను జారవిడచడంతో ఆకిబ్ ఖాతాలో వికెట్ చేరకుండా పోయింది. దాంతో వికెట్ లేకుండానే తన అరంగేట్ర స్పెల్‌ను ముగించాల్సి వచ్చింది.

Story first published: Wednesday, September 30, 2026, 19:12 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+