న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుర్గా పూజ ఎఫెక్ట్: రాంచీ టెస్టు పూణెకి... పూణె టెస్టు రాంచీకి

India vs South Africa: Venues interchanged for second and third Test


హైదరాబాద్: భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఆడనున్న రెండు, మూడో టెస్టు మ్యాచ్ వేదికలు మారాయి. మారిన దాని ప్రకారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు పూణె ఆతిథ్యమిస్తుండగా... మూడో టెస్టుకు రాంచీ ఆతిథ్యమివ్వనుంది.

డీజే పాటలు.. మైదానంలోనే కోహ్లీ స్టెప్పులు (వీడియో)

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్‌లో భారత పర్యటన వెస్టిండిస్ 7తో ముగియనుంది. అనంతరం టీమిండియా సొంతగడ్డపై సపారీ జట్టుతో తలపడనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా సొంతగడ్డపై సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టుల్లో తలపడనుంది.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనున్న రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తుండగా... అక్టోబర్ 19 నుంచి 23 వరకు జరిగే మూడో టెస్టుకు పూణె ఆతిథ్యమివ్వనుంది.

శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ: 17 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు

అయితే రెండు, మూడు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సిన వేదికలను ఇప్పుడు బోర్డు మార్చేసింది. ఈ మార్పుకు సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ కూడా అంగీకరించింది. రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తోన్న సమయంలోనే దూర్గా పూజ ఫెస్టివల్ రావడంతో జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టెస్టుని పుణెకు మార్పాలంటూ బోర్డును కోరింది.

జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కోరికను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఈ మార్పుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇక, మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనుంది.

సపారీ పర్యటన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ జట్టు నవంబర్‌లో భారత్ లో పర్యటనకు రానుంది. ఈ సందర్భంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య 3 టి20లు, 2 టెస్టులు జరగనున్నాయి.

Story first published: Friday, August 9, 2019, 13:49 [IST]
Other articles published on Aug 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X