క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: మరోసారి భారత్-పాకిస్తాన్ సమరం!
క్రికెట్ లోకంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధికారికంగా విడుదల చేసింది. దౌహా వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ తన మొదటి మ్యాచ్ ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-ఏతో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను నవంబర్ 24న యూఏఈతో ఆడనుంది.
ఈ టోర్నీలో మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో శ్రీలంక-ఏ, బంగ్లాదేశ్-ఏ, ఆఫ్ఘనిస్తాన్ -ఏ, హాంకాంగ్ ఉన్నాయి. అలాగే గ్రూప్-బీలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, నేపాల్, యూఏఈ స్థానం సంపాదించాయి. ప్రతీ జట్టు తన గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపులు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ 26, 27 తేదీల్లో జరగనున్నాయి. అలాగే కొన్ని మ్యాచ్‌లు యూనివర్సిటీ ఆఫ్ దౌహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాండ్‌లో జరగనున్నాయి.

గత 2025 ఎడిషన్‌లో ఇండియా-ఏ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించగా.. వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో యూఏఈపై 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ శుభారంభం చేసినప్పటికీ.. పాకిస్తాన్-ఏ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అనంతరం ఒమన్ పై గెలిచి సెమీఫైనల్ చేరిన భారత్, సెమీస్‌లో బంగ్లాదేశ్-ఏతో జరిగిన టై మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు పాకిస్తాన్-ఏ సెమీస్‌లో శ్రీలంకపై గెలిచి, ఫైనల్లో బంగ్లాదేశ్‌ను సూపర్ ఓవర్లో ఓడించి విజేతగా నిలిచింది. ఈ సారి 2026 ఎడిషన్‌లో భారత్ పాత పరాజయాన్ని మర్చిపోయి కప్‌ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


