కివీస్‌కు షాకిచ్చేందుకు టీమిండియా రెడీ.. రికార్డు మామూలుగా లేదుగా!
IND vs NZ: భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ ల ఈ టీ20 సిరీస్ అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ హెగ్లే ఓవల్‌లో జరగనుండగా.. టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా టీ20 రికార్డును పరిశీలిస్తే.. 2009లో తొలిసారిగా పర్యటించినప్పుడు భారత్ 2--0 తేడాతో సిరీస్ కోల్పోయింది.అలాగే 2019లోనూ పరాజయం చవిచూసింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న టీమిండియా కివీస్ గడ్డపై ఆడిన మొత్తం 12 టీ20 మ్యాచ్‌లలో 7 విజయాలను నమోదు చేసింది. ఇందులో 2020 పర్యటనలో సూపర్ ఓవర్ ద్వారా సాధించిన రెండు విజయాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ భారత్ 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా.. 2022లో జరిగిన చివరి పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.

ఇరు జట్ల మధ్య టీ20 క్రికెట్లో ఇప్పటవరకు మూడు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. వీటిలో రెండింటిని సూపర్ ఓవర్లో భారత్ గెలుచుకోగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది. 2022లో నేపియర్లో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఆట నిలిచిపోవడంతో న్యూజిలాండ్ నిర్దేశించిన డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్ ఆ లక్ష్యాన్ని అందుకోలేక మ్యాచ్ టై అయింది.
ఓవరాల్ హెడ్-టు-హెడ్ రికార్డులను చూస్తే కూడా న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టుదే స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు31 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 19 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కివీస్ జట్టు కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగలిగింది. ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను కూడా భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలు
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బెవోన్ జాకబ్స్, కైల్ జేమిసన్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), నాథన్ స్మిత్, బ్లేర్ టిక్నర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


