IND vs NZ 2nd Test: చెలరేగిన బుమ్రా, షమీ.. న్యూజిలాండ్ 235 ఆలౌట్

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ బౌలర్లు చెలరేగారు. మహ్మద్ షమీ (4/81), జస్‌ప్రీత్ బుమ్రా (3/62), ఉమేశ్ యాదవ్(1/46), రవీంద్ర జడేజా (2/22) సమష్టిగా చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కోహ్లీసేనకు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్(52), జేమీసన్ (49), బ్లండెల్(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. విలియమ్సన్(3), రాస్ టేలర్(15), నికోలస్ (14) దారుణంగా విఫలమయ్యారు. 5 వికెట్లతో కోహ్లీసేన బ్యాటింగ్ పతనాన్ని శాసించిన యువ ప్లేయర్ కైలీ జేమీసన్.. బ్యాటింగ్‌లోను మరోసారి రాణించి భారత్ ఆధిక్యాన్ని అడ్డుకున్నాడు. వాగ్నర్(21)తో తొమ్మిదో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు.

ఉమేశ్ యాదవ్ శుభారంభం..
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టుకు ఉమేశ్ యాదవ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ బ్లండెల్(30)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌ను కీపర్ క్యాచ్‌గా బుమ్రా ఔట్ చేశాడు. దీంతో నాలుగు పరుగుల వ్యవధిలోనే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది.

టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(15)తో మరో ఓపెనర్ టామ్ లాథమ్ పోరాడాడు. ఈ క్రమంలో 119 బంతుల్లో 5 ఫోర్లతో లాథమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు.. టేలర్, లాథమ్ (52)లను పెవిలియన్ చేర్చారు. టేలర్‌ను జడేజా ఔట్ చేయగా.. లాథమ్‌ను షమీ బౌల్ట్ చేశాడు. ఆ వెంటనే తన మరుసటి ఓవర్లోనే హెన్రీ నికోలస్(14)ను క్యాచ్ ఔట్‌గా షమీ వెనక్కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 133 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బంతి వ్యవధిలోనే..
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా ఒకే ఓవర్లో బంతి వ్యవధిలోనే వాట్లింగ్ (0), సౌథీ(0)లను పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఇక క్రీజులోకి వచ్చిన యువ ప్లేయర్ కైలీ జేమీసన్‌తో గ్రాండ్ హోమ్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. జడేజా అడ్డుకున్నాడు. అద్భుత బంతితో గ్రాండ్ హోమ్‌ను బౌల్డ్ చేాశాడు.
చిక్కుల్లో హార్ధిక్ పాండ్యా.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా..

కొరకరాని కొయ్యగా జేమీసన్..
భారత్‌కు యువ ప్లేయర్ కైలీ జేమీసన్ కొరకరాని కొయ్యగా మారాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించిన ఈ యువ ప్లేయర్.. బ్యాటింగ్‌లోనూ రాణించి కోహ్లీసేన ఆధిక్యాన్ని అడ్డుకున్నాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన జేమీసన్.. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వాగ్నర్(21)తో తొమ్మిదో వికెట్‌కు 48 పరుగులు.. ట్రెంట్ బౌల్ట్‌తో 7 పరుగులు జోడించాడు. అతని అద్భుత బ్యాటింగ్‌తో 200లోపు ఆలౌటయ్యే జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. అయితే 63 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన జేమీసన్‌ను కీపర్‌గా క్యాచ్‌గా షమీ పెవిలియన్ చేర్చడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications