న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 2nd Test: బూమ్ బూమ్ బుమ్రా.. పట్టుబిగించిన భారత్

India vs New Zealand, 2nd Test: India eye sizeable lead after Jadeja removes de Grandhomme

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టుబిగించింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన.. బౌలింగ్‌లో మాత్రం అద్బుత ప్రదర్శన కనబర్చింది. ఇటీవల నిలకడలేమి ఫామ్‌తో తీవ్ర విమర్శలపాలైన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బంతితోనే విమర్శకులకు సమాధానం చెప్పాడు. అద్భుత (3/49) బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అతనికి తోడు మహ్మద్ షమీ (2/54), ఉమేశ్ యాదవ్(1/46), రవీంద్ర జడేజా (2/17) రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కైలీ జెమీసన్ (23 బ్యాటింగ్), వాగ్నర్ (3 బ్యాటింగ్) ఉన్నారు. చేతిలో రెండు వికెట్లున్న కివీస్ 52 పరుగుల వెనుకంజలో ఉంది.

1
46212
ఉమేశ్ యాదవ్ శుభారంభం..

ఉమేశ్ యాదవ్ శుభారంభం..

అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోర్ 63/0‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టుకు ఉమేశ్ యాదవ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ బ్లండెల్‌(30)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌ను కీపర్ క్యాచ్‌గా బుమ్రా ఔట్ చేశాడు. దీంతో నాలుగు పరుగుల వ్యవధిలోనే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది.

టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(15)తో మరో ఓపెనర్ టామ్ లాథమ్ పోరాడాడు. ఈ క్రమంలో 119 బంతుల్లో 5 ఫోర్లతో లాథమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు.. టేలర్, లాథమ్ (52)లను పెవిలియన్ చేర్చారు. టేలర్‌ను జడేజా ఔట్ చేయగా.. లాథమ్‌ను షమీ బౌల్ట్ చేశాడు. ఆ వెంటనే తన మరుసటి ఓవర్లోనే హెన్రీ నికోలస్(14)ను క్యాచ్ ఔట్‌గా షమీ వెనక్కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 133 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

బంతి వ్యవధిలోనే..

బంతి వ్యవధిలోనే..

ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా ఒకే ఓవర్లో బంతి వ్యవధిలోనే వాట్లింగ్ (0), సౌథీ(0)లను పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఇక క్రీజులోకి వచ్చిన యువ ప్లేయర్ కైలీ జేమీసన్‌తో గ్రాండ్ హోమ్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. జడేజా అడ్డుకున్నాడు. అద్భుత బంతితో గ్రాండ్ హోమ్‌ను బౌల్డ్ చేాశాడు.

Story first published: Sunday, March 1, 2020, 8:20 [IST]
Other articles published on Mar 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X