Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Japan: 2 పరుగులే తేడా.. ఎలాగోలా పరువు కాపాడుకున్న భారత్!

India vs Japan: జపాన్ లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిసింది. వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు కేవలం 2 పరుగుల తేడాతో జపాన్ పై విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపాడు.

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు జపాన్ బౌలర్లు ఊహిచని షాక్ ఇచ్చారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో భారత అగ్రశ్రేణి బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే తొలి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టగా.. తర్వాత ఓవర్లలో సంజు శాంసన్(9), ఇషాన్ కిషన్(3) కూడా త్వరగానే ఔటయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 బంతుల్లో 16 పరుగులు చేసి ఓవర్ చివరలో ఔట్ అవ్వడంతో భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పురుగులు మాత్రమే చేయగలిగింది.

India vs Japan T20 India Edges Past Japan by 2 Runs to Record 200th T20I Victory Details

అనంతరం 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. జపాన్ బ్యాటర్లు ధీటుగా పోరాడినప్పటికీ.. నిర్ణీత 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులకే పరిమితమయ్యారు. చివరి బంతికి జపాన్ గెలుపునకు 4 పరుగులు అవసరం కాగా.. అక్షర్ పటేల్ ఒత్తిడిని జయించి కేవలం ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

IND vs AUS: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ కొడుకు.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs AUS: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ కొడుకు.. భారత్ ఘన విజయం!

ఈ విజయంతో భారత పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అంతర్జాతీయ మ్యాచ్ లలో 200వ విజయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2006లో జోహన్నెస్‌బర్గ్ లో దక్షిణాఫ్రికాపై తొలి విజయాన్ని అందుకున్న భారత్, సుదీర్ఘ ప్రయాణంలో ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.

భారత టీ20ల్లో 200 విజయాల ప్రయాణం:

*1వ విజయం: దక్షిణాఫ్రికాపై (2006, జోహన్నెస్‌బర్గ్) - 6 వికెట్ల తేడాతో

*50వ విజయం: శ్రీలంకపై (2017, కొలంబో) - 7 వికెట్ల తేడాతో

*100వ విజయం: వెస్టిండీస్‌పై (2022, కోల్‌కతా) - 8 పరుగుల తేడాతో

*150వ విజయం: ఆస్ట్రేలియాపై (2024, గ్రోస్ ఐలెట్) - 24 పరుగుల తేడాతో

*200వ విజయం: జపాన్‌పై (2026, సానో) - 2 పరుగుల తేడాతో

Story first published: Tuesday, September 22, 2026, 14:20 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+