For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నావా? లేక చూపు మందగించిందా?

India vs England: Virender Sehwag takes a jibe at third umpire for giving Suryakumar Yadav out in the fourth T20I
Ind vs Eng 4th T20I : Twitter Reacts To Suryakumar Yadav's Dismissal In 4th T20I Against England

అహ్మదాబాద్: సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37) సూపర్ షో‌కు బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్(3/42), హార్దిక్ పాండ్యా(2/16) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నాలుగో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే సూర్య.. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

కోహ్లీ అసహనం..

సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో నటరాజ్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

ఏందీ రెడ్డి.. ఏకంగా ధోనీ స్టంపే లేపేసావ్!

కళ్లకు గంతలు కట్టుకున్నావా?

ఈ వివాదాస్పద నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని మరి ఈ నిర్ణయం తీసుకున్నాడనే మీమ్‌ను ట్వీట్ చేశాడు. అంత స్పష్టంగా బంతి నేలకు తాకినట్లు కనబడుతుంటే ఆధారం లేదని థర్డ్ అంపైర్ ఎలా ఔటిస్తాడని వీవీఎస్ లక్ష్మణ్ ప్రశ్నించాడు. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రాలు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

చూపు మందగించిందా?

బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్‌గా ప్రకటించాడంటే, థర్డ్ అంపైర్ కళ్లకి ఆపరేషన్ చేయించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనదేశంలో కాబట్టి అవుట్ ప్రకటించారు కానీ వేరే దేశంలో అంపైర్ అయినా ఇలా నేలపై తాకి వచ్చిన క్యాచ్‌గా అవుట్‌గా ప్రకటించేవారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా భారత్ మ్యాచ్ గెలిచింది కాబట్టి బతికిపోయారని, లేకుంటే అంపైర్లకు మూడేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. సుందర్ ఔట్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయ్. సుందర్ ది ఔట్ కాదని..సిక్స్ అని నెటిజన్లు థర్డ్ అంపైర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

సూర్య ప్రతాపం..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

Story first published: Friday, March 19, 2021, 8:46 [IST]
Other articles published on Mar 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+