Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలియనప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఎలా ఔట్ ఇస్తాడు: విరాట్ కోహ్లీ

India vs England: Virat Kohli questions Suryakumars controversial dismissal

అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో ఔటైన తీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఫీల్డ్ అంపైర్ల తీరు తనకేం అర్థం కాలేదన్నాడు. ఓ ఫీల్డర్ క్యాచ్ విషయంలో సందేహంగా ఉన్నప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌గా ఔట్ ఎలా ఇస్తాడని ప్రశ్నించాడు. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) ఔటైన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. మ్యాచ్ అనంతరం ఈ వివాదాస్పద నిర్ణయంపై స్పందించిన విరాట్ కోహ్లీ.. అంపైర్ల తీరును తప్పుబట్టాడు.

క్లారిటీ అవసరం..

క్లారిటీ అవసరం..

'టెస్టు సిరీస్ సమయంలో నేను అజింక్యా రహానె పక్కన ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి చోటుచేసుకుంది. రహానే క్యాచ్‌ స్పష్టంగా పట్టుకున్నా దానిపై అతడు కచ్చితంగా లేడు. దాంతో మేం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లాం. ఇలాంటి విషయాల్లో ఫీల్డరే సందేహాస్పదంగా ఉంటే, స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ స్పష్టంగా చూసే ప్రసక్తే లేదు. ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటప్పుడు అంపైర్లకు కూడా 'ఐ డోంట్‌ నో కాల్‌' అనేది ఎందుకు ఉండకూడదో నాకు అర్థంకావడం లేదు. అది అంపైర్ కాల్‌లాగే ఉంటుంది. ఈ నిర్ణయాలు మ్యాచ్‌ల ఫలితాలను మార్చగలవు. ఈరోజు మేం దాన్ని ఎదుర్కొన్నాం. రేపు వేరే జట్టు ఇలాంటి స్థితిలో ఉండొచ్చు. ఇలాంటి వాటిని ఆటలో నుంచి తొలగించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కీలకమైన మ్యాచ్‌ల్లో ఇలాంటివి సరికావు. మైదానంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని మేం కోరుకుంటున్నాం' అని కోహ్లీ అన్నాడు.

సూర్య సూపర్..

సూర్య సూపర్..

సూర్య ఆడిన తీరుతో తామంతా అవాక్కయ్యామని టీమిండియా కెప్టెన్ తెలిపాడు. అద్భుత బ్యాటింగ్‌తో స్కై అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని ప్రశంసించాడు. 'మంచు ప్రభావం వీపరితంగా ఉన్న మ్యాచ్‌లో టాప్ టీమ్‌తో ఆడటం చాలా కష్టం. ఆట మధ్యలో కొన్ని సంఘటనలు వింతగా అనిపించాయి. కానీ 180 ప్లస్ స్కోర్ లక్ష్యంగా ఆడాం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. అతను మా జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు.

అంత ఈజీ కాదు..

అంత ఈజీ కాదు..

సూర్య మొదలు పెట్టిన తీరుతో మేమంతా అవాక్కయ్యాం. మూడో స్థానంలో అలా వచ్చి రావడంతోనే భారీ షాట్లు ఆడటం అంత సులువైన పని కాదు. శ్రేయస్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ గెలుపు క్రెడిట్ అంతా ఈ యువ ఆటగాళ్లదే. వచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్నారు. హార్దిక్ వేసిన నాలుగో ఓవర్లు కూడా అద్భుతం. శార్దూల్ మ్యాచ్‌ను టర్న్ చేశాడు. ఇక మా పవర్ ప్లే బ్యాటింగ్‌ను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.'అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక కెరీర్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలి బంతినే సూర్య సిక్సర్‌గా మలిచాడు.

పాపం సూర్య‌కుమార్ యాదవ్, సుంధర్.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు బలి!

అందుకే మైదానం వీడా..

అందుకే మైదానం వీడా..

ఇక మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మైదానం వీడటం అందర్ని షాక్ గురిచేసింది. అయితే తాను డగౌట్‌లో కూర్చుని ఉండటానికి గల కారణాన్ని స్వయంగా కెప్టెన్ కోహ్లీనే వెల్లడించాడు. 'ఫీల్డింగ్ సమయంలో బంతిని వెంటాడుతూ వెళ్లి.. వేగంగా త్రో చేశాను. దాంతో కాలు కొద్దిగా బెణికినట్లు అనిపించింది. ఆ సమయంలో అలానే ఫీల్డింగ్ కొనసాగిస్తే..? గాయపడే ప్రమాదం ఉన్నందున మైదానం వీడాను. శనివారం చివరి టీ20 మ్యాచ్ ఉండటంతో.. మైదానం వెలుపలికి వెళ్లడమే సరైన నిర్ణయమని నేను భావించా'అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సమరంలో ఇరుజట్లు ఇప్పుడు 1-1తో సమంగా నిలిచాయి. చివరి టీ20 శనివారం జరగనుంది.

Story first published: Friday, March 19, 2021, 13:08 [IST]
Other articles published on Mar 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+