పాపం సూర్యకుమార్ యాదవ్, సుంధర్.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు బలి!

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. తన కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. అయితే దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈ ముంబై ఆటగాడికి ఈ మ్యాచ్‌లోనూ థర్డ్ అంపైర్ రూపంలో వెంటాడింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి జోష్‌లో ఉన్న సూర్య.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. ప్రస్తుతం సూర్య ఔటైన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇంతకేం జరిగిందంటే..?
సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో నటరాజ్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు.

ఇదెక్కడి రూల్..
అయితే బంతి నేలకు తాకినట్లు కనబడుతుంటే థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉంటాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని, ఫీల్డ్ అంపైర్ తొందరపడి సాఫ్ట్ సిగ్నల్‌గా ఔటిచ్చాడని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే నిబంధనే దిక్కుమాలినదని మండిపడుతున్నారు. అలాగే సరైన ఆధారం లేదని చెప్పడం కూడా విచిత్రంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అంపైర్‌కు కళ్లు కనిపించడం లేదని, మంచి డాక్టర్‌కు చూపించాలని సెటైర్లు పేల్చుతున్నారు.
టెక్నాలజీ ఓవర్ రూల్ ఇట్..
అది ఖచ్చితంగా నాటౌటని, టెక్నాలజీ ఓవర్ రూల్ ఇట్ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేయగా.. ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయానికి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనెరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం బుద్దిలేనిదని మరొకరు కామెంట్ చేశారు. సంజయ్ మంజ్రేకర్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇలాంటి లోక్యాచ్‌లను స్లో మోషన్‌లో చూస్తే అర్థమవుతుందని చురకలంటించాడు. ఇక మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని రిప్లే చూసినట్లున్నాడని సెటైర్లు పేల్చాడు.
వాషింగ్టన్ సుంధర్ కూడా..
ఇక ఆఖరి ఓవర్‌లో వాషింగ్టన్ సుంధర్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు. అతను ఔటవ్వడమే కాకుండా భారత జట్టు 6 పరుగుల కోల్పోవాల్సి వచ్చింది. ఆర్చర్ వేసిన నాలుగో బంతిని సుంధర్ రాంప్ షాట్ ఆడగా.. బంతి థర్డ్ మ్యాన్ ఫీల్డర్‌గా ఉన్న రషీద్ చేతిలో పడింది. అయితే రషీద్ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ తొక్కినట్లు కనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇస్తూ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. రషీద్ బౌండరీ లైన్ తాకినట్లు స్పష్టత లేదని ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో గెలవడం మంచిదైంది. లేకపోతే అంపైర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications