IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ సేనను కలవర పెడుతున్న రికార్డ్స్! 62 మ్యాచ్‌ల్లో ఏడే విజయాలు!

నాటింగ్‌హామ్: 2011లో 0-4తో క్లీన్ స్వీప్.. 2014లో 1-3, 2018లో 1-4.. సంత్సరాలు మారుతున్న ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు ప్రదర్శన మాత్రం మారడంలేదు. పటిష్ట ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై రెండు సార్లు ఓడించి చరిత్ర సృష్టించినా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం మాత్రం కలగానే మిగిలిపోతోంది. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కోహ్లీసేన సిద్దమైంది. బుధవారం నుంచి ప్రారంభమమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుండటంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తుండగా.. భారత్‌లో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఫలితంగా డబ్యూటీసీ సెకండ్ ఎడిషన్ ఘనంగా ప్రారంభించాలనుకుంటుంది. పేపర్‌పై ఇరు జట్లు బలంగానే ఉన్నప్పటికీ గత రికార్డులు కోహ్లీసేనను కలవరపెడుతున్నాయి.

62 మ్యాచ్‌ల్లో 7 విజయాలు!
ఇంగ్లండ్-భారత్ టెస్ట్ చరిత్రను చూసుకుంటే ఇరు జట్లు మధ్య 1932లో తొలి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 152 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించేందుకు భారత్‌కు ఏకంగా 20 ఏళ్ల సమయం పట్టింది. 1952లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లోఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత మరో పదేళ్లకు 1962లో మరో విజయాన్నందుకుంది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఇరు జట్లు 122 మ్యాచ్‌లు ఆడగా.. ఇంగ్లండ్ 48 మ్యాచ్‌లతో పై చేయి సాధించింది. భారత్ మాత్రం కేవలం 29 సార్లే గెలుపొందింది. మరో 49 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక ఇంగ్లండ్ గడ్డపై భారత రికార్డు మరీ పేలవంగా ఉంది. మొత్తం 62 మ్యాచ్‌లు ఆడగా భారత్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. 34 సార్లు ఇంగ్లండ్ విజయం సాధించగా.. 21 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి.

బ్యాటింగే కీలకం
భారత జట్టు ప్రధాన సమస్య బ్యాటింగ్. స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ శుభారంభాలు అందించి.. పుజారా, కోహ్లీ, రహానేల్లో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఆ తర్వాత లోయరార్డర్‌లో పంత్, శార్దూల్, అశ్విన్ కావాల్సిన రన్స్ చేయగలరు. షా, సూర్య, మయాంక్‌లతో బెంచ్ కూడా బలంగానే ఉంది. బౌలింగ్ లైనప్‌లో స్వింగ్ చేసే బౌలర్ లేడన్నది తప్పితే పెద్దగా లోపాలేమీ లేవు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన పేస్ బౌలింగ్‌తోపాటు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. సిరాజ్ బాల్‌ను స్వింగ్ చేయగలడు. అక్కడి కండిషన్స్ అతని బౌలింగ్‌కు బాగా సూటవుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతన్ని తీసుకోకుండా చేసిన పొరపాటును కోహ్లీ ఈసారి రిపీట్ చేయకపోవచ్చు.
Rohit vs Kohli ఇగోను పక్కన పెట్టి చెలరేగితే.. ఇంగ్లండ్‌కు దబిడి దిబిడే!

ఇంగ్లండ్.. స్టార్లు మిస్
మరోవైపు సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ బలహీనపడింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తోపాటు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా సిరీస్‌కు దూరమయ్యారు. మొత్తం యువకులతో కూడిన బ్యాటింగ్ లైనప్ భారాన్ని కెప్టెన్ జోరూటే మోయాల్సి ఉంది. పైగా ఈ ఏడాది మొదట్లో ఇండియాకు వచ్చిన ఆ టీమ్ 1-3తో ఓడింది. సిరీస్ ప్రారంభానికి ముందు ఇది కూడా ఇండియన్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఇటీవల పాక్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో ఆ జట్టు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో విజయాలు సాధించింది. అవకాశం కోసం ఎదురు చూసే ఆటగాళ్లు ఆ జట్టులో పుష్కలం. కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువ.

పేస్ పిచ్‌లతో ప్రతీకారం
ఇంగ్లండ్ భారత్‌కు వచ్చినప్పుడు పూర్తిగా స్పిన్ పిచ్‌లతో వాళ్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. అశ్విన్ ఏకంగా 32 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది. దీంతో పచ్చికతో కూడిన పేస్ పిచ్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు స్వాగతం పలకడానికి ఆ టీమ్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ టెస్ట్‌కు సిద్దం చేస్తున్న పిచ్‌పై పచ్చిక చూస్తుంటే పేస్, స్వింగ్‌కు అనుకూలించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications