For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit vs Kohli ఇగోను పక్కన పెట్టి చెలరేగితే.. ఇంగ్లండ్‌కు దబిడి దిబిడే!

IND vs ENG: Rohit Sharma And Virat Kohli Clash To Decide Indias Fate In England Tour
IND vs ENG : Rohit Sharma - Virat Kohli Clash ఇగో పక్కన పెట్టి ఆడాల్సిందే ! || Oneindia Telugu

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరో రసవత్తర పోరుకు సిద్దమవుతోంది. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన..ఆ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. వర్షం అంతరాయం నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయలేక మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్ వైఫల్యం కూడా భారత్ పతనాన్ని శాసించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం అక్కడే ఉండిపోయిన కోహ్లీసేన.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో రేపటి(బుధవారం) నుంచి ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.

డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుండటం.. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీసేన బరిలోకి దిగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినంత మాత్రాన తమ జట్టు అత్యుత్తమం కాదంటే ఒప్పుకోనన్న కోహ్లీకి ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై ఓడించి విమర్శకుల నోరు మూయించాల్సిన అవసరం అతనిపై ఉంది.

 ఇగోను పక్కనపెట్టాల్సిందే..

ఇగోను పక్కనపెట్టాల్సిందే..

ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే మాటలు చెప్పినంత సులువు కాదు. పకడ్బందీ ప్రణాళికలతో పాటు సరైన కాంబినేషన్స్‌తో బరిలోకి దిగాలి. లేకుంటే 2018, 2014 టూర్ ఫలితాలు రిపీట్ అవుతాయి. 2014లో ధోనీ సేన 1-3తో సిరీస్‌ను కోల్పోగా ఓ మ్యాచ్ డ్రా అయింది. 2018లో కోహ్లీసేన 1-4తో చిత్తయింది. ఈ సారి చరిత్రను తిరగరాయాలి. అలా చేయాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత శర్మలు తమ ఇగోలను పక్కన పెట్టి ఆడాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే విషయం ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా స్పష్టమైంది. ఆ తర్వాత కలిసి మ్యాచ్‌లు ఆడినా ఎడమోహం, పెడ మోహంగానే ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం లభించిన సెలవుల్లోనూ ఈ ఇద్దరూ వేర్వేరు గ్రూప్స్‌తో ఇంగ్లండ్ చుట్టేసారు. దాంతో వీరి మధ్య ఇంకా సంబంధాలు మెరుగుపడలేదనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

Tokyo 2020: ఇది కదా క్రీడా స్పూర్తి.. మనసులు గెలుచుకున్న ఆటగాళ్లు!

కోహ్లీ-రోహిత్ చెలరేగాలి..

కోహ్లీ-రోహిత్ చెలరేగాలి..

గతంలో మాదిరి ఈ ఇద్దరు కలిసి పరుగుల వరద పారిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో రోహిత్‌ సలహాలను కోహ్లీ కోరినా పోయేదేం ఉండదు. ఏదీ ఎమైనా జట్టు విజయమే ప్రధాన లక్ష్యంగా ఈ ఇద్దరు సమన్వయంగా ఆడాలి. కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది.

సెంచరీల నిరీక్షణకు అతను ఈ సిరీస్‌లోనే తెరదించాలి. మరోవైపు సెహ్వాగ్ తరహా ఓపెనింగ్ ఫార్మూలాతో ఓపెనర్‌గా ప్రమోషన్ కొట్టి.. స్వదేశంలో సత్తా చాటిన రోహిత్ శర్మ విదేశాల్లోనూ తానెంటో నిరూపించుకోవాలి. పరిమిత ఓవర్లలో ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు అందించిన రోహిత్-కోహ్లీ ఈ సిరీస్‌లోనూ ఆ జోరును కొనసాగిస్తే భారత్‌కు తిరగుండదు.

మరో ఇద్దరు తోడైతే..

మరో ఇద్దరు తోడైతే..

ప్రస్తుత భారత జట్టులో ఉన్న సమస్య ఏదైనా ఉందంటే అది బ్యాటింగే. బ్యాటింగ్ బలహీనతతోనే డబ్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ముఖ్యంగా కదిలే బంతులను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం భారత జట్టుకు ఉంది. కోహ్లీ, రోహిత్‌కు జతగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రహానేలో ఇద్దరు చెలరేగితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు. అప్పుడు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా లోయరార్డర్‌తో మెరుపులు మెరిపించగలడు. శార్దూల్ ఠాకూర్, అశ్విన్ తలో చేయి వేసినా భారీ స్కోర్ చేయవచ్చు.

పేసర్లు రాణించాల్సిందే..

పేసర్లు రాణించాల్సిందే..

ఫస్ట్ టెస్ట్‌కు గ్రీన్ వికెట్ సిద్దం చేస్తున్న నేపథ్యంలో భారత్ నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. అంతేకాకుండా స్వింగ్ బౌలర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. భారత పేసర్ల ఫామ్ కూడా బానే ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో బుమ్రా విఫలమైనప్పటికీ.. 2018 పర్యటనలో అతను రాణించాడు. ముఖ్యంగా షమీ, ఇషాంత్ శర్మలు చెలరేగారు.

పైగా బుమ్రాకు విదేశాల్లో ఆడిన అనుభవమే ఎక్కువ. మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అతను 5 వికెట్లు తీసాడు. వీళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరుగుండదు. పైగా బెన్ స్టోక్స్ గైర్హాజరీ టీమిండియాకు కలిసొచ్చే అంశం.

Story first published: Tuesday, August 3, 2021, 18:59 [IST]
Other articles published on Aug 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+