Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఓటమికి ఐపీఎల్ కారణం: మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా యూరప్ పర్యటనలో అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబరిచింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో పర్యటించిన టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లను కోల్పోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ పర్యటనలో ఆడిన మొత్తం 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక్కదానిలో కూడా విజయం సాధించలేకపోయింది. మొదట ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న భారత్.. అనంతరం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4 తేడాతో కోల్పోయి వైట్‌వాష్ అవమానాన్ని చవిచూసింది. ఈ ఘోర ఓటముల నేపథ్యంలో ఆటగాళ్ల ఆటతీరుపై, జట్టు ఎంపికపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా కొంపముంచింది ఆ 3 తప్పులే: స్టార్ క్రికెటర్

టీమిండియా కొంపముంచింది ఆ 3 తప్పులే: స్టార్ క్రికెటర్

ఐపీఎల్ వ్యవస్థదే తప్పు: సంజయ్ మంజ్రేకర్
ఈ తీవ్ర విమర్శల మధ్య భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరాజయాలకు ఆటగాళ్లను నిందించడానికి మంజ్రేకర్ నిరాకరించారు. ఐపీఎల్ నిర్మాణ శైలి, దాని ఆధారంగా జరుగుతున్న ఆటగాళ్ల ఎంపికే ఈ పతనానికి అసలు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ పరాజయానికి ప్లేయర్లను తప్పుబట్టడం చాలా సులువైన విషయమని.. కానీ ఐపీఎల్ పిచ్‌లను, నిబంధనలను పూర్తిగా బ్యాటర్లకు మాత్రమే అనుకూలంగా మార్చేసిన వారిదే అసలైన బాధ్యత అని సంజయ్ మంజ్రేకర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు.

India vs England T20 Series Sanjay Manjrekar Blames IPL and Impact Player for Team India 0-4 T20 Loss

ఐపీఎల్ ఆటతీరును బట్టి ప్లేయర్లను ఎంపిక చేయొద్దు..
సెలెక్టర్ల ముందున్న అసలైన సవాలును సంజయ్ మంజ్రేకర్ గుర్తు చేశారు. ఐపీఎల్ టోర్నీలో నమోదయ్యే భారీ రికార్డులు, లెక్కలను చూసి కాకుండా.. విదేశీ బౌన్సీ పిచ్‌లపై, కఠినమైన పరిస్థితులలో రాణించగల టెక్నిక్ ఉన్న బ్యాటర్లను గుర్తించి ఎంపిక చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్ లో భారత్ తన టీ20 మ్యాచ్‌లలో అత్యధికంగా విదేశీ గడ్డలపైనే ఆడాల్సి ఉంటుందని.. స్వదేశీ పిచ్‌లపై సులభంగా పరుగులు సాధించి గెలిచే శకం ముగిసిందని సెలెక్టర్లను హెచ్చరించారు.

బీసీసీఐ సంచలన నిర్ణయం: టీమిండియాకు డబుల్ షాక్!

బీసీసీఐ సంచలన నిర్ణయం: టీమిండియాకు డబుల్ షాక్!

ఇంటర్నేషనల్ క్రికెట్ శాపంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఐపీఎల్ ఫార్మాట్ పై వస్తున్న ఆరోపణలను ఈ సిరీస్ ఓటమి మరోసారి నిజం చేసింది. ఐపీఎల్ లో పిచ్ లను పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా తయారు చేయం, చిన్న బౌండరీలు ఉండటం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. వీటికి తోడు ఇంపాక్ట్ ప్లేయర్ వంటి రూల్స్ బ్యాటర్లకు అదనపు స్వేచ్ఛను, రక్షణను ఇస్తున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి వెసులుబాట్లు ఏవీ ఉండవు. విదేశీ పరిస్థితుల్లో బంతి అదనపు బౌన్స్, స్విగ్ అవుతున్నప్పుడు బ్యాటర్లు తమ టెక్నిక్ తో ఒత్తిడిని ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ పరిస్థితులకు అలవాటు పడిన భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాడి ముందు అందుకే తలవంచాల్సి వచ్చింది.

ఇక వన్డే సిరీస్ పైనే అందరి ఆశలు
టీ20 సిరీస్ ముగియడంతో టీమిండియా తదుపరి లక్ష్యంపై దృష్టి సారించింది. జులై 14 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తున్నారు. ఈ వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Story first published: Sunday, July 12, 2026, 17:55 [IST]
Other articles published on Jul 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+