Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కొంపముంచింది ఆ 3 తప్పులే: స్టార్ క్రికెటర్

IND vs ENG: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా ఆటతీరు అత్యంత నిరాశపరిచింది.భారత జట్టు వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో ఓడిపోవడంతో పాటు ఆడిన 7 మ్యాచ్‌లలో ఓ ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శన తర్వాక టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ లోగా టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా భారత్ వరుస పరాజయాలకు 3 ప్రధాన కారణాలను గుర్తించాడు. యూరప్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో మొత్తం 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఒక్కదానిలో కూడా విజయం సాధించలేకపోయింది. భారత్ మొదట ఐర్లాండ్ జట్టుతో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ భారత్‌ను 4-0 తేడాతో ఓడించింది.

బీసీసీఐ సంచలన నిర్ణయం: టీమిండియాకు డబుల్ షాక్!

బీసీసీఐ సంచలన నిర్ణయం: టీమిండియాకు డబుల్ షాక్!

టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు
టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా భారత ఘోర పరాజయానికి 3 ప్రధాన కారణాలను గుర్తించారు. పుజారా ప్రకారం.. భారత్ వరుస పరాజయాలకు బలహీనమైన మిడిలార్డర్ బ్యాటింగ్, నాణ్యమైన ఆల్‌రౌండర్ లేకపోవడం, దారుణమైన ఫీల్డింగ్ ప్రధాన కారణాలు అంటూ వెల్లడించాడు.

India vs England T20 Series Cheteshwar Pujara Blames these 3 Big Mistakes for Team India 0-4 T20 Series Loss

బలహీనమైన మిడిలార్డర్ బ్యాటింగ్
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఛతేశ్వర్ పుజారా.. ఇరు జట్ల మిడిలార్డర్ల ప్రదర్శనలో ఎంతో తేడా ఉందని ఛతేశ్వరా పుజారా పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టులో 5,6,7, 8వ స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు ప్రతి మ్యాచ్‌లో జట్టుకు సహకారం అందించారు. కానీ భారత్ తరఫున తిలక్ వర్మ 5వ స్థానంలో, శివమ్ దూబే 6వ స్థానంలో వచ్చినా.. వారు ఇంగ్లాండ్ మిడిలార్డర్ చూపినంత ప్రభావాన్ని చూపలేకపోయారు.

ఇంగ్లాండ్‌పై ఘోర ఓటమి: ఈ 5గురు భారత స్టార్ ఆటగాళ్లు అవుట్!

ఇంగ్లాండ్‌పై ఘోర ఓటమి: ఈ 5గురు భారత స్టార్ ఆటగాళ్లు అవుట్!

ఆందోళనగా మారిన ఆల్‌రౌండర్ల కొరత
భారత జట్టులో నమ్మకమైన ఆల్‌రౌండర్ లేకపోవడం కూడా స్పష్టంగా కనిపిస్తోందని ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ నిలకడగా రాణించగల ఆల్‌రౌండర్ భారత్‌కు లేరు. ఇది జట్టుకు ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్తులో దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుందని పుజారా పేర్కొన్నాడు.

పేలవమైన ఫీల్డింగ్‌పై తలెత్తుతున్న ప్రశ్నలు
జట్టు పేలవమైన ఫీల్డింగ్ ను కూడా ఛతేశ్వర్ పుజారా ప్రశ్నంచాడు. అటువంటి నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. ఇది యువ జట్టు కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్‌లో తప్పులు జరగడం సహజమన్నాడు. కానీ పేలవమైన ఫీల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నాడు. టీ20 క్రికెట్లో ఫీల్డింగ్ ఓ మ్యాచ్ గమనాన్ని మార్చగలదు.. కానీ ఈ సిరీస్ అంతటా భారత ఫీల్డింగ్ నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఇది జట్టు అతిపెద్ద బలహీనతలలో ఒకటని వెల్లడించాడు.

Story first published: Sunday, July 12, 2026, 17:08 [IST]
Other articles published on Jul 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+