
ఎవరు ఊహించలేదు..
'టీమిండియాకు ఇంతమంది క్రికెటర్లు ఆడగలరని ఆరు నెలల క్రితం ఎవ్వరం ఊహించి ఉండం. జంబో జట్టుతో పర్యటనలకు వెళ్లడాన్ని చూసుకుంటే బుడగల వల్ల జట్టుకు జరిగిన మేలు ఇదే. సాధారణంగా 17-18 మంది ఆటగాళ్లను పర్యటనలకు ఎంపిక చేస్తారు. బయో బబుల్, కరోనా ఆంక్షల వల్ల ఈ సారి 25-30 లేదా అంతకన్నా ఎక్కువమందితో వెళ్తున్నాం. దీంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు నిశితంగా ఆలోచించాల్సి వస్తోంది. అదృష్టమో దురదృష్టమో మేం 30 మందితో ఆడాల్సి వచ్చింది. ఎవరు బాగా ఆడతారు ఎవరు ఆడరో తెలిసింది. ఈ విధానం బాగా పని చేసింది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఒకేసారి రెండు జట్లతో..
ప్రస్తుత ప్రదర్శనలను బట్టి చూస్తే భవిష్యత్తులో రెండు వేర్వేరు జట్లను భారత్ మైదానంలోకి దించగలదని అనిపిస్తోందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2021లో తీరిక లేని షెడ్యూలుతో సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చినా ఇబ్బందేమీ లేదన్నాడు. 'ఇలాంటివి మనం ఊహించలేం. కానీ పరిస్థితులు వాటిని సాకారం చేశాయి. అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్న కుర్రాళ్లను చూస్తే సంతోషమేస్తోంది. ఇప్పుడు భారత్ ఒకేసారి రెండు జట్లను బరిలోకి దించగలదు' అని టీమిండియా హెడ్ కోచ్ పేర్కొన్నాడు.

బీసీసీఐ కసరత్తు..
టీమిండియా టైట్ షెడ్యూల్ కారణంగా ఆసియాకప్ టీ20 ట్రోఫీ వాయిదాపడే ప్రమాదం ఏర్పడింది. దాంతో భారత జట్టును రెండుగా విభజిస్తే ఎలా ఉంటుందనేదానిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ఇటు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రెండింటికీ తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత జట్టు ఆ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనున్నది. ఇందుకోసం సుదీర్ఘకాలం ఇంగ్లండ్‌లోనే గడపాలి. అదే సమయంలో ఆసియాకప్ టీ20 ట్రోఫీ కూడా ఉండటంతో జట్టును రెండుగా విభజించేందుకు బీసీసీఐ రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.
IPL 2021: అందుకే కేటీఆర్ రిక్వెస్ట్‌ను బీసీసీఐ పట్టించుకోలేదా? కావాలనే హైదరాబాద్‌ను తప్పించారా?


Click it and Unblock the Notifications
