Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: అందుకే కేటీఆర్ రిక్వెస్ట్‌ను బీసీసీఐ పట్టించుకోలేదా? కావాలనే హైదరాబాద్‌ను తప్పించారా?

Whats the reason for Hyderabad ignored for IPL-2021

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2021 సీజన్ వేదికలపై నెలకొన్న రచ్చ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఇందులో హైదరాబాద్, మొహాలీ, జైపూర్ వేదికలను తప్పించింది. దీనిపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను నామమాత్రంగానే సంప్రదించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ముంబై వంటి నగరంతో పోల్చుకుంటే హైదరాబాద్, జైపూర్, మొహాలిలో కరోనా కేసులు ఎక్కువగా లేవు. అంతేకాకుండా తమ వద్ద ఐపీఎల్ నిర్వహిస్తే పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు కూడా బీసీసీఐకి చెప్పాయి. అయినా సరే ఈ మూడు వేదికలను బోర్డు కావాలనే తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేదికలపై బోర్డుకు ఉన్న ప్రతికూల అభిప్రాయల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసోసియేషన్ గొడవలే కారణం..

అసోసియేషన్ గొడవలే కారణం..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. హెచ్‌సీఏలో అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు ఎవరికి వారే అనే తీరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీసం హైదరాబాద్ రంజీ జట్టును సిద్దం చేయడంలోనూ విఫలమయ్యారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు.

అందుకే పట్టించుకోలేదు..

అందుకే పట్టించుకోలేదు..

ఏటా జరగాల్సిన ఏజీఎంను కూడా హెచ్‌సీఏ నిర్వహించలేకపోయింది. అనామకులను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. హెచ్‌సీఏలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలతో బీసీసీఐ పెద్దలు కూడా విసుగు చెందారు. ప్రొఫెషనల్‌గా నడిపించాల్సిన అసోసియేషన్‌ను రాజకీయ గొడవలకు కేంద్రంగా మార్చారని బోర్డు ఆగ్రహంతో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అందుకే, ఐపీఎల్‌ను హైదరాబాద్‌‌లోనూ నిర్వహించాలని స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ ప్రకటన చేసినా బీసీసీఐ పట్టించుకోలేదని సదరు అధికారి పేర్కొన్నాడు.

రైతు ఉద్యమంతో..

రైతు ఉద్యమంతో..

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నడుస్తున్నది. గతేడాది నవంబర్‌ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనల్లో పంజాబ్ రైతులదే కీలక పాత్ర. ఇలాంటి సమయంలో మొహాలిలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే రైతులు అడ్డుకునే అవకాశం ఉన్నట్లు బీసీసీఐకి సమాచారం అందినట్లు ఒక అధికారి తెలిపారు. ఐపీఎల్ స్టేడియం వెలుపల ఆందోళనలు జరిగితే అది బ్రాండింగ్‌కు నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతోనే మొహాలిని తప్పించినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ గప్‌ చుప్

రాజస్థాన్ గప్‌ చుప్

గుజరాత్‌లో ఎలాంటి ఐపీఎల్ ఫ్రాంచైజీ‌లు లేవు. కానీ, గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అహ్మదాబాద్‌లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జైపూర్‌ను తాత్కలికంగా పక్కనపెట్టి అహ్మదాబాద్ మొతేరాను వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయంలో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. అందుకే ఆ యాజమాన్యం జైపూర్ వేదికపై పెద్దగా పట్టుబట్టడం లేదంటున్నారు. ఏదేమైనా ఆ మూడు వేదికలను జాబితా నుంచి తప్పించడానికి కరోనా ముఖ్య కారణం కాదని, వేరే కారణాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

Story first published: Wednesday, March 10, 2021, 10:26 [IST]
Other articles published on Mar 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+